పైసలియ్యలే.. ఓటెందుకేస్తా..?

సహకార విద్యుత్ సంస్థల పాలకవర్గ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే చందుర్తి మండలం నర్సింగాపూర్లో ఓ మహిళ ఓటు వేయనంటూ నిరసన తెలిపింది. ఊరిలో అందరికి ఓటు పైసలిచ్చి తనకు మాత్రం ఇయ్యలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. పైసలిస్తే కానీ ఓటు వేయనని తెగేసి చెప్పింది. 

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సెస్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సెస్ పరిధిలో 87,130 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు, రెబెల్స్​ కలిపి 75 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 750 మంది ఎన్నికల సిబ్బంది, 15 మంది రూట్ ఆఫీసర్లు విధుల్లో ఉన్నారు. 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.