
- జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఈ నెల 3 నుంచి 30 వరకు ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి తెలిపారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో స్వీప్ కార్యక్రమాల నిర్వహణ పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు పనిచేయాలన్నారు.
ఈ నెల 3న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత కోసం 16న 2కే రన్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, స్వీప్ నోడల్ అధికారి జగదీశ్ రెడ్డి, ఎన్నికల నోడల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.