మునుగోడులో జోరుగా కొత్త ఓటర్ల నమోదు

  • మునుగోడుకు ఓట్లు మార్చుకుంటున్న పక్క నియోజకవర్గాల ఓటర్లు

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటుకు 10 వేలు ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేయించుకుంటున్నారు. పక్క నియోజకవర్గ ఓటర్లు సైతం మునుగోడుకు ఓటు మార్చుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 13 వేల 962 మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వేరే నియోజకర్గం నుంచి 488 మంది మునుగోడుకు తమ ఓటును బదిలీ చేయించుకున్నారు. ఉప ఎన్నిక ఉండడంతో వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా తమ సొంత ప్రాంతమైన  మునుగోడు నియోజకవర్గానికి వస్తున్నారు. ఆధార్ కార్డులో అడ్రస్, ఓట్ల మార్పిడి చేయించుకుంటున్నారు. దీంతో మీ సేవ కేంద్రాలు, నియోజకవర్గంలోని  తహసీల్దార్ ఆఫీసుల్లో రద్దీ పెరిగింది.