నగర వాసులు ఓటు వేసేందుకు సొంతూళ్ల బయలుదేరారు. ప్రయాణికుల రద్దీతో సిటీలోని ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్ లు కిక్కిరిసిపోయాయి. తగినన్న బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు.
అదేవిధంగా స్కూళ్లకు రెండు రోజులు, ప్రైవేట్ ఆఫీసులకు పోలింగ్ రోజు సెలవు ఇవ్వడంతో ప్రజలు సొంత గ్రామాలకు బయలుదేరారు. ఉదయం నుంచే బస్టాండ్లు కిటకిటలాడగా సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది.