డబ్బుల కోసం రోడ్డెక్కిన ఓటర్లు..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెర పడి 144సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉండగా, నేతలంతా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో డబ్బులు పంచలేదని ప్రజలు రోడ్డుకెక్కారు. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో ఓటుకు రూ.3వేలు ఇచ్చినా కింది స్థాయి నేతలు తమకు డబ్బులు పాంచలేదని అక్కడి ఓటర్లు ఆందోళనకు దిగారు.

గాజువాకలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. డబ్బులు పంచాట్లేదాని ఓటర్లు ఆందోళనకు దిగారని సమాచారం అందుతోంది. ఓటును హక్కుగా భావించి, భవిష్యత్తు మీద బాధ్యతతో ఓటు వేయాల్సిన ప్రజలే ఇలా డబ్బుల కోసం రోడ్డెక్కటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా చెప్పచ్చు.ఈ విషయంలో మార్పు రావాల్సింది నాయకుల్లో కాదు, ముమ్మాటికీ ప్రజల్లోనే అని చెప్పాలి.