ఓటు కోసం 4 కిలోమీటర్ల ప్రయాణం

ఓటు కోసం 4 కిలోమీటర్ల ప్రయాణం

జమ్మికుంట, వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామ పంచాయతీ పరిధిలోని ముల్లపల్లి గ్రామానికి చెందిన ఓటర్లు సుమారు నాలుగు కిలోమీటర్ల ప్రయాణించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ గ్రామంలో 2-00 మంది ఓటర్లు ఉండగా వీరికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పాపయ్యపల్లిలో పోలింగ్‌‌‌‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ముల్లపల్లిలోనే పోలింగ్‌‌‌‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను కోరినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. విలువైన ఓటును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో పాపయ్యపల్లికి వెళ్లి ఓటు వేసినట్లు చెప్పారు.