ఓటర్ల సందేహాలకు ఓటరు సహాయ మిత్ర

హైదరాబాద్, వెలుగు: కొత్త ఓటర్లతో పాటు ప్రత్యేక ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పక్షాలు తమ సందేహాలను తీర్చుకోవడానికి వీలుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్ ను అందుబాటులోకి తెచ్చింది. సీఈవో వెబ్‌సైట్- https://ceotelangana.nic.in  తెరిచిన వెంటనే ఇది విజిటర్స్​కు కనిపిస్తుంది. ఇక్కడ ఎపిక్ కార్డు, పోలింగ్ బూత్, బూత్ స్థాయి ఆఫీసర్ వంటి వివిధ రకాల సమాచారాన్ని ఎలా, ఎక్కడ వెతకాలో ‘ఓటరు సహాయ మిత్ర’ సూచిస్తుంటుంది. 

ALSO READ: హైదరాబాద్​లో ..  కిలో కందిపప్పు రూ.200

ఓటు, ఎన్నికలకు సంబంధించిన ఏదైనా అంశంపై ఫిర్యాదు లేదా అభ్యర్థుల అఫిడవిట్ల వివరాలను అందించడంలో సహాయపడుతుందని సీఈఓ ఆఫీస్ అధికారులు తెలిపారు. దివ్యాంగులైన ఓటర్లు వారికోసం ఎన్నికల సంఘం అందించే వీల్ చైర్ వంటి  ప్రత్యేక సౌకర్యాలను తెలుసుకోవడంలో  కూడా  మార్గదర్శిగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.