మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మొత్తం ఓటర్లు 6,17,901 మంది ఉన్నారు. ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తర్వాత బుధవారం ఎన్నికల సంఘం ఫైనల్ లిస్టును రిలీజ్ చేసింది. జిల్లాలో 3,08,630 మంది పురుషులు, 3,09,299 మంది స్త్రీలు, 42 మంది ట్రాన్స్జెండర్స్ మొత్తం కలిపి 6,17,901గా లెక్క తేలారు. మంచిర్యాల నియోజకవర్గంలో 2,64,186 మంది, చెన్నూరులో 1,84,117 మంది, బెల్లంపల్లి నియోజకవర్గంలో 1,69,598 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే సర్వీస్ ఓటర్లు చెన్నూరులో 133, బెల్లంపల్లి 161, మంచిర్యాలలో 333, మొత్తం 627 మంది నమోదయ్యారు. ఎన్నారై ఓటర్లు చెన్నూరులో ఆరుగురు, బెల్లంపల్లిలో ఇద్దరు, మంచిర్యాల 21 మంది కలిపి మొత్తం 29 మంది ఉన్నారు.
ఆసిఫాబాద్లో ఓటర్లు 4,47,634
ఆసిఫాబాద్జిల్లాలో గత ఎన్నికల ఓటర్ల కంటే ఈసారి ఏకంగా 70,384 మంది పెరిగారు. పురుషులు 2,23,802, మహిళలు 223805తోపాటు 27 మంది ఇతరులతో కలిపి మొత్తం ఓటర్లు 4,47,634 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సిర్పూర్ నియోజకవర్గంలో 2,22,973 ఓటర్లు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,24,661 మంది ఉన్నారు.