మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు బస్ చార్జీలు ఇస్తామని నాయకులు ముంబయి నుంచి పిలిపించి.. ఓటు వేసిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పుడు తాము ముంబయి ఎలా వెళ్లాలని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఓటు వేసిన తర్వాత ముఖం చాటేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
పోలింగ్ను బహిష్కరించిన రంగంతండా వాసులు
మరోవైపు గట్టుప్పల్ మండలం రంగం తండా గ్రామస్తులు ఉపఎన్నిక ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవంటూ ఫైర్ అయ్యారు. సమస్యలను చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఓటు వేసేందుకు వెళ్లమని స్పష్టం చేశారు. ఈ తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి