రావాలమ్మా రావాలి.. తీసుకోని వాళ్లు రావాలి..ఓటర్లకు డబ్బులిస్తున్నారు

తెలంగాణలో ఎన్నికల్లో ఈ సారి ధన ప్రవాహం మామూలుగా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 700 కోట్లకు పైగా పట్టుబడిందంటే చెప్పొచ్చు  ఏ రేంజ్లో   డబ్బుల పంపిణీ జరిగిందో..  చాలా చోట్ల  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ఓటర్లు బహిరంగంగానే చెబుతున్నారు.  కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు ఓటు వేయలేదు కూడా.. డబ్బులిస్తేనే ఓటు వేస్తాం లేకపోతే ఓటు వెయ్యబోమని ఓటర్లు  కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకు కూడా దిగారు.

 లేటెస్ట్ గా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు జమ్మిగడ్డలో ఓటర్లు  ఆందోళనకు దిగారు. డబ్బులు రాలేదంటూ నిరసనకు దిగారు. రావాలమ్మా రావాలి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ మైకుతో నిరసనలు తెలిపారు. డబ్బులు పంపిణీ చేసిన నాయకుడి ఇంటి ముందు నిరసనకు దిగారు. డబ్బులు ఇస్తామంటూ కాలయాపన చేపించి.. తెల్లవారుజామున 3 గంటల వరకు ఎదరుచూసినా డబ్బులివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఇచ్చిన  40 లక్షలు పంపిణీ చేయకుండా కొందరే తీసుకున్నారని ఆరోపించారు.   ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.