సూర్యాపేట, వెలుగు : కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇంటి నంబర్ ఆధారంగా ఓటరు జాబితా విడుదల చేయాలని తెలంగాణ యువజన సంఘం నాయకులు అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు వివిధ వార్డుల్లో ఉన్నాయని చెప్పారు. ఒక కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే వార్డులో క్రమసంఖ్యలో వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సంఘం నాయకులు ఏనిగ సంతోష్ రెడ్డి, దరావత్ వెంకటేశ్, నాయక్, భాషిపంగు సునిల్, చెరుకు నగేశ్, మధుసూదన్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.