మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు(నవంబర్ 20)న ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివెళ్లారు. పోలింగ్ ప్రారంభించడానికి అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే మహారాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోని.. ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి క్యూ కట్టారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఆయన ఫ్యామిలీతోపాటు ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb
— ANI (@ANI) November 20, 2024
RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా నాగ్ పూర్ లో ఆయన ఓటు వేశారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవర్ బారామతి అసెంబ్లీ నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. బుధవారం ఉదయాన్నే ఆయన ఓటు వినియోగించుకున్నారు.
#WATCH | Nagpur, Maharashtra: RSS Chief Mohan Bhagwat says, "In a democracy, voting is a citizen's duty. Every citizen should perform this duty. I was in Uttaranchal, but I came here last night to cast my vote. Everyone should vote..."#MaharashtraAssemblyElections2024 https://t.co/TPje6eCYg2 pic.twitter.com/U6ePRamY7f
— ANI (@ANI) November 20, 2024
#WATCH | Baramati: Maharashtra Deputy CM and NCP candidate from Baramati Assembly constituency, Ajit Pawar shows his inked finger after casting his vote for #MaharashtraElection2024
— ANI (@ANI) November 20, 2024
He says "Mahayuti is going to form the government here..." pic.twitter.com/oGsCBMMbsL
#WATCH | NCP-SCP MP Supriya Sule along with her family show their inked fingers after casting a vote for #MaharashtraAssemblyElections2024
— ANI (@ANI) November 20, 2024
NCP has fielded Deputy CM Ajit Pawar and NCP-SCP has fielded Yugendra Pawar from the Baramati Assembly constituency. pic.twitter.com/x22KuN8OEI
రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నవంబర్ 18న ముగిసింది. నవంబర్ 20న పోలింగ్ జరుగుతుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 4136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మహాయుతిలో భాగంగా బీజేపీ 149 స్థానాల్లో ..సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81, అజిత్ పవార్ లోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(MVA) కాంగ్రెస్,ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. కాంగ్రెస్ 101,శివసనేన యూబీటీ 95,శరద్ పావర్ పార్టీ 86 చోట్ల బరిలోకి దిగింది.