పకడ్బందీగా ఓటింగ్ యంత్రాల పంపిణీ : దీపక్ తివారీ

పకడ్బందీగా ఓటింగ్ యంత్రాల పంపిణీ : దీపక్ తివారీ

ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: ఓటింగ్  ​యంత్రాలను అధికారులు పకడ్బందీగా పంపిణీ చేశారు. ఆసిఫాబాద్, సిర్పూర్​ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వేణు, దీపక్ తివారీ ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమన్ని కలెక్టర్ హేమంత్ సహదేవురావు, ఎస్పీ సురేశ్ కుమార్ పరిశీలించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, యూనిట్ బాక్స్ లను సిబ్బందికి అందజేశారు. 438 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి 16 మంది నోడల్ అధికారులు, 599 మంది బీఎల్ ఓలు, 87 మంది రూట్ అధికారులు, ఇతర అధికారులు ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు.10 పారా మిలటరీ దళాలతో పాటు మొత్తం 2200 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం వద్ద మాట్లాడుతూ.. ఈశీఎం ర్యాండమైజేషన్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను కేటాయించామన్నారు. పోలింగ్ కేంద్రాలకు బస్సులు ఏర్పాటు చేశామని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సకాలంలో బయల్దేరడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రిటర్నింగ్ అధికారి రాములు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.