ఏప్రిల్ 14తో ముగియనున్న ఓటు నమోదు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఓటు నమోదుకు ఈ నెల14తో గడువు ముగియనుందని 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ వెంటనే నమోదు చేసుకోవాలని కలెక్టర్​రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఫారం నెంబర్​ -6 నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. ఆన్​లైన్​లో​ ఆధార్ కార్డు లేదా ఎస్ఎస్​ సీ మెమో ఆధారంగా ఓటు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.