
హైదరాబాద్, వెలుగు: కమర్షియల్ ఎలక్ట్రికల్ వెహికల్స్తయారు చేసే ఢిల్లీ కంపెనీ వొయిలర్ మోటార్స్విస్తరణ బాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పది ఔట్లెట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇది వరకే మూడు ఔట్లెట్లు ఉన్నాయని, కరీంనగర్, వరంగల్ సహా పలు నగరాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
హైదరాబాద్‌లో గురువారం కంపెనీ బిజినెస్, సేల్స్ వీపీ వాణి మెహ్రా మీడియాతో మాట్లాడుతూ ‘‘మేం ప్రస్తుతం ఒక త్రీవీలర్, ఒక ఫోర్‌వీలర్ అమ్ముతున్నాం. త్రీవీలర్ ధర రూ.4.43 లక్షలు కాగా, 4 వీలర్ ధరలు రూ.9.20 లక్షల నుంచి రూ.14.15 లక్షల వరకు ఉంటాయి. త్రీ వీలర్ 120 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 4 వీలర్ లాంగ్రేంజ్200 మోడల్ 200 కిలోమీటర్లు, టీ1250 మోడల్ 140 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
మాకు హర్యానాలో ప్లాంటు ఉంది. దక్షిణాదిలోనూ ప్లాంటు పెట్టేఆలోచన ఉంది. తయారీ సామర్థ్యాలను పెంచడానికి రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేశాం”అని ఆమె వివరించారు.