నాన్​ లోకల్​ క్యాంపెయినర్లు వెల్లిపోవాలి : వీపీ గౌతమ్​

ఇయ్యాల సాయంత్రంతో ప్రచారాలు బంద్​ 
29న స్కూళ్లకు సెలవు30న ఎలక్షన్​ రోజు పబ్లిక్​ హాలిడే

ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మంగళవారం  సాయంత్రం 5 గంటల నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంను ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసర్స్ భవనంలో సోమవారం సీపీ విష్ణు యస్. వారియర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం  సాయంత్రం 5 గంటల నుంచి వచ్చే నెల 1 తేదీ సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ అమలు కానుందని తెలిపారు. జిల్లాలో ఓటు హక్కు లేని వారు  వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. స్టార్ క్యాంపెయినర్స్, అభ్యర్థులు ప్రెస్ మీట్ వంటి ప్రోగ్రామ్స్ జరపవద్దన్నారు.

అన్ని ప్రసార మాధ్యమాలతో పాటు , సోషల్ మీడియా ప్రచారం ను సైతం నిలిపివేయాలని కోరారు.  ఓటర్ లిస్టు లో పేరుండి, పోల్ స్లిప్ అందని ఓటర్లు ఓటింగ్ సమయంలో ఏవైనా రెండు ఐడెంటిటీ కార్డ్స్ తెచ్చుకోవాలన్నారు. ఈ నెల 29న స్కూల్స్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 30 న ఓటింగ్ నేపథ్యంలో పబ్లిక్ హాలిడే ఉంటుందన్నారు.  డిసెంబర్ 1న కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.  పోలింగ్ సందర్భంలో ఫిర్యాదు చేయాలనుకుంటే సివిజిల్ యాప్ ద్వారా లేదా 1950,100 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎన్నికల సూపరిండెంట్ రాంబాబు పాల్గొన్నారు.