సత్తుపల్లి, వెలుగు : ఎన్నికల విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని ఎన్నికల పరిశీలకులు సత్యేంద్ర సింగ్, ఖమ్మం కలెక్టర్ కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను హెచ్చరించారు. గురువారం స్థానిక జ్యోతి నిలయం స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను వారు పరిశీలించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల అనుసంధానాన్ని గమనించారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో కార్యకలాపాలను, ఎన్నికల ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించి పట్నంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి అశోక్ చక్రవర్తి, ఏసీపీ రామాంజనేయులు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ యోగేశ్వరరావు, కమిషనర్ సుజాత, ఆర్ఐ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి : మేడిపల్లి సత్యం