ఖమ్మం టౌన్, వెలుగు: ఎన్నికల విధుల్లో సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా కీలకమని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో సెక్టార్పోలీస్, రిటర్నింగ్, సెక్టోరల్ ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్టోరల్ ఆఫీసర్లు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టామని, డబ్బు, లిక్కర్, ఇతర ఓటరు ప్రభావిత వస్తువుల తరలింపును అడ్డుకోవాలన్నారు.
డూప్లికేట్ఓటర్ల లిస్ట్తయారుచేసి పీఓకు ఇవ్వాలని ఆదేశించారు. వల్నరబులిటీ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. యువతతో బూత్ లెవల్అవేర్ నెస్ టీమ్స్ఏర్పాటు చేయాలని సూచించారు. సి విజిల్ యాప్ పై అవగాహన కల్పించాలన్నారు. స్వీప్ నోడల్ ఆఫీసర్శ్రీరామ్ ఎన్నికల ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల అడిషనల్కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఖమ్మం మున్సిపల్కమిషనర్ ఆదర్శ్ సురభి, రిటర్నింగ్ ఆఫీసర లు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వీవీసీ ట్రస్ట్ ద్వారా జిల్లా గవర్నమెంట్మెడికల్కాలేజీకి డొనేట్చేసిన అంబులెన్స్ ను కలెక్టరేట్ఆవరణలో కలెక్టర్ గౌతమ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్.ఎస్.రాజేశ్వరరావుకు అప్పగించారు. ట్రస్ట్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ ను కలెక్టర్ అభినందించారు. అలాగే ఎన్నికల కోడ్ముగిసే వరకు రూ.50వేలకు మించి క్యాష్తీసుకెళ్లొద్దని కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో సూచించారు. వైద్యం, పిల్లల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు ఇతర అవసరాలకు క్యాష్క్యారీ చేస్తున్నవారు సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు.