భిక్కనూరు, వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 63వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ తాము 63 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ వెంటనే స్పందించాలని కోరారు.
వృద్ధాశ్రమంలో వైద్య శిబిరం
లింగంపేట, వెలుగు: మండలంలోని బాయంపల్లి తండా అమూల్య వృద్ధాశ్రమం ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కామారెడ్డికి చెందిన డాక్టర్ వెంకట్ జమున రాథోడ్ రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. కార్య క్రమంలో అశ్రమ నిర్వహకుడు రవీందర్‌నాయక్, బాయంపల్లి సర్పంచ్ బాలయ్య, ఉప సర్పంచ్ సవిత, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులురాలు జమున రాథోడ్, లీడర్లు పాషా, మంగ్త్యానాయక్, రమేశ్, సురేశ్‌నాయక్, వినోద్, గణేశ్ పాల్గొన్నారు.
29 నుంచి బీఎల్ఎఫ్ రాజకీయ శిక్షణ తరగతులు
కామారెడ్డి, వెలుగు: బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ( బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 29, 30వ తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ యూనియన్ స్టేట్ లీడర్ ఎస్.సిద్ధిరాములు తెలిపారు. ఆదివారం కామారెడ్డిలో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, వీటిని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రతినిధులు కమ్మరి సదానందం, వడ్ల సాయికృష్ణ పాల్గొన్నారు.
క్రీడా స్ఫూర్తిని చాటాలి
పిట్లం, వెలుగు: క్రీడల్లో గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలం పెద్దఎడ్గిలో స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నిని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా మరో సారి గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. క్రీడల అభివృద్ధికి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, మాజీ జడ్పీటీసీ మాధవరావు, వివేకానంద యూత్ ప్రెసిడెంట్ సందీప్, సెక్రటరీ చరణ్ నాయకులు నీలు పటేల్, విజయ్‌పటేల్, వెంకట్‌గౌడ్, యూత్ మెంబర్లు లక్ష్మణ్, షంషు యువకులు పాల్గొన్నారు.
సబ్ స్టేషన్‌లో కోతుల హల్‌చల్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో ఆదివారం కోతులు హల్‌చల్ చేశాయి. సబ్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చిన కోతుల మందలోని రెండు కోతులు షార్ట్ సర్కూట్‌తో చనిపోయాయి. దీంతో మిగతా కోతులు అక్కడ కొద్ది సేపు హంగామా చేశాయి. కోతల హంగామాతో టౌన్‌లో గంటన్నర పాటు కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది.
అ‘పూర్వ’ సమ్మేళనం
నందిపేట, వెలుగు: నందిపేట మండలం అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివిన 1984-–85 బ్యాచ్ స్టూడెంట్లు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి విద్యాబోధన చేసిన నాగేశ్వరరావు సార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మీసాల సుదర్శన్, అవదూత గంగాధర్, డాక్టర్ శాబీర్,హెడ్‌కానిస్టేబుల్ రాములు, వనజ, పద్మ, సునీత పాల్గొన్నారు.
మొక్కలు నాటిన బీజేపీ లీడర్లు
నిజామాబాద్, వెలుగు: పండిట్ దీన్ దయాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇందూరులోని మహాలక్ష్మి నగర్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో బీజేపీ లీడర్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ దీన్ దయాల్ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చేరిన అనతి కాలంలోనే సంఘ్ అగ్ర నేతగా ఎదిగారని గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతకర్తగా పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.
మొక్కలు నాటిన బీజేపీ లీడర్లు
నిజామాబాద్, వెలుగు: పండిట్ దీన్ దయాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇందూరులోని మహాలక్ష్మి నగర్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో బీజేపీ లీడర్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ దీన్ దయాల్ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చేరిన అనతి కాలంలోనే సంఘ్ అగ్ర నేతగా ఎదిగారని గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతకర్తగా పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.
ఎస్సీ, ఎస్టీలకు వీడీసీలో పదవులిస్తలేరు
ఇందల్వాయి, వెలుగు: మండలంలోని సిర్నాపల్లి గ్రామాభివృద్ధి కమిటీలో ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన దళిత, గిరిజన సంఘాల లీడర్లు ఆరోపించారు. ఆదివారం ఈ విషయంపై ఇందల్వాయి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో 28 కులాలు ఉండగా 20 ఏళ్లుగా చిన్న కులాలకు వీడీసీలో పదవులు ఇవ్వడం లేదని ఆరోపించారు. తమకు కమిటీలో పదవులిస్తే దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు తమ ఆధ్వర్యంలో జరుగుతాయని.. ఇది ఇష్టంలేకే పదవులు కేటాయించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీడీసీపై చర్యలు తీసుకోవాలని, పదవుల్లో అన్ని కూలాలకు ఛాన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజ్ఞా స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి
బోధన్, వెలుగు: బోధన్‌లోని ప్రజ్ఞా స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ జోనల్ ఇన్‌చార్జి సూరత్రామ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ప్రజ్ఞా స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న క్రాంతి అనే స్టూడెంట్‌పై దాడి చేసిన విషయాన్ని హాస్టల్ వార్డెన్ ఆకాశ్ స్టూడెంట్ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడని తెలిపారు. అయితే స్కూల్ యామాన్యంతో ఆ వార్డెన్‌పై దాడి చేసి ఫోన్ లాక్కున్నారని పేర్కొన్నారు. స్టూడెంట్, వార్డెన్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు రవీందర్, దౌలత్‌రామ్, అరవింద్, గణేశ్ పాల్గొన్నారు.