ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం దేవా నాగ రాజు (36) అనే వీఆర్ఏ తన ఇంట్లో ఉరేసుకున్నారు. నాగరాజు తహసీల్దార్ ఆఫీస్‌లో వీఆర్ఏగా పని చేస్తున్నారు. నాగరాజు భార్య లత తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజులుగా నాగరాజు డ్యూటీకి సక్రమంగా వెళ్లడం లేదు.
మానసికంగా ఆందోళనతో బాధపడ్తున్నాడు. ఏమైందని అడిగితే కారణం చెప్పకపోయేవాడని తెలిపారు. మానసిక బాధతో ఇంట్లో తాడుతో ఉరివేసుకున్నాడని చెప్పింది. లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఏరియా హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్సై పాండేరావు తెలిపారు.