![వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలివ్వాలి](https://static.v6velugu.com/uploads/2025/02/vra-heirs-protest-demanding-implementation-of-go-81-85-and-provision-of-employees-to-them_f45162cNPA.jpg)
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: జీవో 81, 85ను అమలు చేసి, తమకు ఉద్యోగులు ఇవ్వాలని వీఆర్ఏ వారసులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి రంగారెడ్డి కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో రోజులు నిరసనలు చేస్తే వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి 16,758 మందినే వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమించారన్నారు. మిగితా 61 ఏండ్లు పైబడిన 3,797 మంది వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అంగీకరించినా నియామకాలు చేపట్టలేదని తెలిపారు. వీరిలో రంగారెడ్డి జిల్లాలో 169 మంది ఉన్నారన్నారు. వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
వికారాబాద్: వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ డిమాండ్చేశారు. వీఆర్ఏ జేఏసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పూజారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వికారాబాద్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శుభ ప్రద్ పటేల్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎంతోమంది వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.