జీతం ఇస్తలేరని వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ఆత్మహత్యాయత్నం

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్​కు తరలింపు, పరిస్థితి విషమం

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రభుత్వం పే స్కేలు ఇస్తామన్న హామీ తీర్చకపోగా.. సమ్మె చేసిన రోజులకు జీతం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వీఆర్ఏ ఆత్మహత్యకు యత్నించాడు. నల్గొండ జిల్లా రాములబండ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కాకుల కొండారంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న మంత్రి వెంకటేశ్వర్లు(39).. పేస్కేలు అమలు చేయాలనే డిమాండ్​తో వీఆర్ఏల సంఘం నిర్వహించిన 80 రోజుల సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఆ హామీ అమలు చేయకపోగా.. సమ్మె కాలానికి సంబంధించిన వేతనం కూడా నిలిపివేసింది.

అటు వేతనం రాక, పే స్కేల్​ అమలు కాకపోవడంతో వెంకటేశ్వర్లు మనస్తాపం చెందారు. ఆర్థిక ఇబ్బందులూ పెరిగాయి. నెలవారీ ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఫైనాన్స్ వాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. బుధవారం ఆయన భార్య ఇంటిముందు పనుల్లో ఉండగా.. వెంకటేశ్వర్లు ఇంట్లో ఫ్యాన్​కు తాడు బిగించి ఉరివేసుకునేందుకు యత్నించారు. ఆయన భార్య ఇది గమనించి కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చి వెంకటేశ్వర్లును నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కండిషన్ సీరియస్​గా ఉందని డాక్టర్లు తెలిపారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.