ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నా నిందలా?: సతీష్

ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నా నిందలా?: సతీష్

రెవెన్యూ ఉద్యోగులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయడం వల్లే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యాయని తెలంగాణ వీఆర్వో అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు గోల్కొండ సతీశ్ అన్నారు. ఒక్కచోట ఏదో జరిగిందని అందరినీ తప్పుపట్టడం భావ్యం కాదన్నారు.బుధవారం ఖైరతాబాద్ లో జరిగిన వీఆర్వోల రాష్ట్రస్థాయి సమావేశంలో వీఆర్వోల వ్యవస్థలో మార్పులు,కొత్త నిర్ణయాలపై వస్తున్న ఊహాగానాలపై చర్చించారు. రెవెన్యూ శాఖ యంత్రాంగం సహకరిస్తేనే సర్కారుకు ఇంత పేరొచ్చిం దని సతీశ్​చె ప్పారు. రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసిన తర్వాత రెవెన్యూ శాఖ రద్దు లేదా మరో శాఖలో విలీనం అనే అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుం దని భావిస్తున్నామని తెలిపారు.216 ఏళ్ల రెవెన్యూ శాఖ రెండు నెలల్లో రద్దు అవుతుందనే మాట తమ గుండెల్ని పిండేస్తోందని ఆవేదనవ్యక్తం చేశారు.

మా కష్టా నికి ఇచ్చే గౌరవం ఇదేనా?

‘‘సమగ్ర కుటుం బ సర్వే చేయాలని 24 గంటల్లో ఆదేశిస్తే చేశాం . భూ ప్రక్షాళన, ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌యూపీ చేసి చూపించాం . మా కష్టాని కి ఇచ్చే గౌరవం ఇదేనా’’ అని సతీశ్ ​ప్రశ్నించారు. ధరణి వెబ్‌ సైట్‌‌‌‌లో సాం కేతిక లోపాలను   చేయకుండా , ఆ నెపాన్ని తమపై నెట్టడం అన్యాయమన్నారు. తాము పని చేయడం లేదనే నెపంతో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అసోసియేషన్‌‌‌‌ రాష్ట్ర అసోసియేట్‌‌‌‌ అధ్యక్షుడు కె.భిక్షపతి, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్, కరీం నగర్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌  నూకల శంకర్‌‌‌‌, ప్రచార కార్యదర్శి హుసేన్‌‌‌‌ రియాజుద్దీన్‌‌‌‌, సాం స్కృతిక కార్యదర్శి భోగం రామచంద్రయ్య, ప్రతినిధులు మహ్మద్‌‌‌‌ మౌలానా , రియాజ్‌‌‌‌, వినయ్‌ , రాజయ్య, సంజీవ, బాల్‌‌‌‌రాజ్‌‌‌‌, శ్రీశైలం, శ్రీనివాస్‌‌‌‌ పాల్గొన్నారు.