నాలుగో తరం స్వల్పశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ(వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్ – వీఎస్ హెచ్ఆర్ఏడీ ఎస్)ను భారత్ రాజస్థాన్లోని ప్రోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఒకే రోజు మూడుసార్లు విజయవంతంగా పరీక్షించింది. ఈ అధునాతన క్షిపణి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని సైనికులు భుజంపై మోసుకెళ్లగలరు.
హైదరాబాద్లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇందులో మినియేచరైజ్డ్ రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి.