ఈబీ-5 వీసాపై టీ- హబ్‌‌లో సెమినార్‌‌

ఈబీ-5 వీసాపై టీ- హబ్‌‌లో సెమినార్‌‌

హైదరాబాద్, వెలుగు: అమెరికాలో పెట్టుబడుల కోసం జారీ చేసే ఈబీ-5 (ఎంప్లాయ్​డ్ ​బేస్డ్​ 5)  గురించి వీఎస్పీ క్యాపిటల్‌‌ స్టార్టప్​ ఇంక్యుబేటర్​ టీ‌‌‌‌–హబ్​లో సెమినార్​ నిర్వహించింది. వీసా హోల్డర్లు 20 మిలియన్​ డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ వంటి మార్కెట్లలో ఇన్వెస్ట్​ చేసి గ్రీన్​కార్డు పొందవచ్చని తెలిపింది. ఈ వీసాతో పెట్టుబడిదారులు, వారి కుటుంబాలు వీఎస్పీ ప్రాజెక్టులో భాగం కావచ్చు. దాదాపు రూ.ఏడు కోట్లు ఇన్వెస్ట్​ చేస్తే ఈబీ5 వీసా పొందవచ్చని వీఎస్పీ క్యాపిటల్​ చైర్మన్​ విక్రమ్​ సాగర్​ పసాలా చెప్పారు. 

ప్యారడైజ్ ​బిర్యానీ చెయిన్​ రెస్టారెంట్​ మాజీ యజమాని డాక్టర్ ఖాజిమ్​సహా పలువురు ఈబీ5 ద్వారా అమెరికాలో ఇన్వెస్ట్​ చేసి స్థిరపడ్డారని వివరించారు.    అటార్నీ అబ్దుల్​ ఈ సందర్భంగా వీసాపై ఇన్వెస్టర్లు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. అమెరికాలోని డౌన్‌‌టౌన్, సబర్బన్ ప్రాంతాలు మొదలైన వాటిలోని రియల్టీ, గ్రీన్​ఎనర్జీ, మైనింగ్​ సెక్టార్లలో కూడా ఇన్వెస్ట్​ చేయొచ్చని విక్రమ్​వివరించారు.