ఫుల్‌గా తాగి, స్కూల్లో బార్ డ్యాన్సర్లతో చిందులు.. వీడియో వైరల్

ఫుల్‌గా తాగి, స్కూల్లో బార్ డ్యాన్సర్లతో చిందులు.. వీడియో వైరల్

మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలో అపవిత్రమైన పనులు చేస్తున్నారు. భోజ్‌పూరి పాటలు, నలుగురు బార్ డ్యాన్సర్లతో ఓ గర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టారు. మద్యం తాగి మహిళలతో అసభ్యకరంగా అక్కడి వారు డ్యాన్సులు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చూసి బడి పిల్లలు ఏం నేర్చుకోవాలి? భోజ్‌పూరీ డ్యాన్సులకు స్కూల్ లో ఎలా పర్మిషన్ ఇస్తారని విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ALSO READ | రూ.300 కోట్ల మోసం చేసి.. వేషం మార్చాడు : చివరికి

బీహార్‌లోని సహర్సా జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్ గ్రౌండ్ లో క్లబ్ డ్సాన్సర్లతో ప్రోగ్రామ్ పెట్టారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మరింది. బీహార్ ప్రభుత్వ విద్యాశాఖపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. విద్యాబుద్దులు నేర్పే ప్లేస్ లో అసభ్యకరమైన కార్యక్రమాలు ఏలా చేస్తారని.. పిల్లలకు అవేనా నేర్పించేదని ఫైర్ అవుతున్నారు. జలాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సెప్టెంబర్ 24 సాయంత్రం నలుగురు లేడీ డ్యాన్సర్లతోపాటు బ్యాండ్ ట్రూప్ ను పిలిపించారు. ఓ పెళ్లి బరాత్ లో భాగంగా అక్కడి స్థానికులు ఈ కార్యక్రమాన్ని సెట్ చేశారు. అందుకు డ్యాన్సర్లు, భోజ్ పూరి కళాకారులు పాఠశాల ఆవరణలో బస చేశారని స్థానికులు చెప్తున్నారు.

ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొంతమంది పురుషులు మద్యం సేవించి..  మహిళలతో నృత్యం చేస్తున్నారు. అలాంటి ఏ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని జలాయి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మమతా కుమారి తెలిపారు. వైరల్ వీడియో మా దృష్టికి వచ్చింది.. విచారణ చేపడుతున్నామని ఆమె తెలిపారు.