హైదరాబాద్ సిటీ, వెలుగు: నెహ్రూ జూపార్కులో మంగళవారం రాబందుల రక్షణ అవగాహన దినోత్సవం నిర్వహించారు. స్టేట్చీఫ్ కన్జర్వేటర్ఆఫ్ఫారెస్ట్, చీఫ్వైల్డ్లైఫ్వార్డెన్డా.ఎలుసింగ్ మేరు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన సుమారు 600 మంది స్టూడెంట్లకు రాబందుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో రాబందులు కీలక పాత్ర పోషిస్తాయని, జూపార్కులో రాబందుల సంతానోత్పత్తికి వైట్ బ్యాక్డ్ వల్చర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏవియన్ కన్జర్వేషనిస్ట్ డాక్టర్ పెర్సీ అవారీ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తెలంగాణ డైరెక్టర్ ఫరీదా తంపల్ పాల్గొన్నారు.
అలాగే జూపార్కులోని ఫారెస్ట్ అమరవీరుల స్థూపం వద్ద బుధవారం అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.