ఈవీఎంలపై సందేహాలకు వీవీప్యాట్ తో చెక్

ఎన్నికల సీజన్ రాగానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల పనితీరుపై డిస్కషన్‌ మొదలవుతుం ది. ఈవీఎంలో తమకు నచ్చిన అభ్యర్థి పేరు, గుర్తులకు ఎదురుగా ఉన్న బటన్ నొక్కితే…కొన్ని సెకన్ల వ్యవధితో బీప్‌ శబ్దం తో ఓటు నమోదవుతుంది. అయితే, అది తాను అనుకున్న గుర్తుకు పడుతుం దా, లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొత్తంగా ఈవీఎంల వాడకంపై అనేక అనుమానాలు వస్తున్నాయి . వీటన్నిటికీ చెక్ పెట్టే ఏకైక పరికరమే ‘ఓటర్ వెరిఫయబుల్ పేపర్ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)’ యంత్రం. ఈవీఎంలకు అనుసంధానంగా ఉంటాయి ఈ వీవీప్యాట్ యంత్రాలు.

వీవీప్యాట్‌ ఎలా పనిచేస్తుం ది?

ఓటు వేసిన తరువాత  వీవీప్యాట్ యంత్రం నుంచి ఓ స్లిప్‌ విడుదలవుతుంది. ఈవీఎంలో తాను నొక్కిన గుర్తుకు ఓటు పడిందో, లేదో ఈ చీటీ ద్వారా ఓటరు తెలుసుకోవచ్చు. కేవలం ఏడు సెకన్ల పాటే ఈ చీటీ కనిపిస్తుంది. ఆ తర్వాత మెషీన్‌ స్లాట్ లోకి జారిపోతుంది. వీవీప్యాట్ యంత్రాన్ని నేరుగా కాంతి పడే ప్రదేశంలో పెట్టినప్పుడు యంత్రంలోని కాంట్రాస్ట్ సెన్సర్ సరిగా పని చేయదు. ఫలితంగా ఎవరికి ఓటుపడిందో తెలియ చేసే చీటీ రాదు. దీని పై గతంలోనే నిపుణుల కమిటీ అధ్యయనం చేసి, సెన్సర్ సరిగా పనిచేయక పోవడం వల్లనే స్లిప్‌ రావడం లేదని నిర్ధారించింది. దీంతో వీవీప్యాట్ యంత్రానికి కొన్నిమార్పులు  చేయాలని సూచించింది. కాంట్రాస్ట్ సెన్సర్ ని కప్పి ఉంచే విధంగా సేఫ్ గార్డ్‌ (కవచం)లాంటి ఓ చిన్న పరికరాన్ని అమర్చాలని నిపుణులు సలహా ఇచ్చారు. దీంతో, లైట్‌ నేరుగా వీవీప్యాట్  పైపడినా ఓటరు వేసిన తర్వాత  స్లిప్‌ రావడానికిఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.

తేమను పీల్చుకోని కాగితమే బెటర్

తేమను పీల్చుకునే కాగితం (టిష్యూ పేపర్‌)ని వాడినప్పుడు, చాలాసార్లు స్లిప్‌ రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా అసలు తేమను పీల్చుకోని కాగితాన్ని వీవీప్యాట్‌ యంత్రాల్లో వాడాలని నిపుణుల కమిటీ సూచించింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలకు అనుసంధానంగా వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించారు.అయితే, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలలోజరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీవీప్యాట్ యంత్రాలు సరిగా పనిచేయడం లేదన్న ఆరోపణలు వెలువడ్డాయి . ఇవన్నీ వీవీప్యాట్ యంత్రాల తయారీలో జరిగిన కొన్ని టెక్నికల్‌ ఎర్రర్స్‌ వల్లనే అని నిపుణులు చెప్పారు. 2017లో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో అనేక చోట్ల వీవీప్యాట్ యంత్రాలు మొరాయించాయి. 15 శాతానికి పైగా వీవీప్యాట్ యంత్రాలను మార్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం, ఆ తర్వాత మార్చడం కూడా జరిగింది. పోలింగ్ ప్రక్రియ కొన్ని గంటల పాటుఆగిపోయింది. అయితే, ఈ రకమైన ఇబ్బందులుకేవలం 4.3 శాతం మాత్రమే. ఆ తర్వాత ఎక్కడఎన్నికలు జరిగినా వీవీప్యాట్ యంత్రాలను పెద్ద-సంఖ్యలో స్పేర్ లో పెడుతున్నారు . ఎక్కడ ఏ చిన్నఅవాంతరం ఎదురైనా కొన్ని నిమిషాల్లోనే మొరాయించిన యంత్రాన్ని మార్చేసి, కొత్త యంత్రాన్నిఈవీఎంకి సెట్ చేయగలుగుతున్నారు . దీంతో చాలావరకు వీవీప్యాట్ యంత్రాలతో అవాం తరాలు రావడం తగ్గిపోయాయి . ఈ నేపథ్యం లో పటిష్టమైన వీవీప్యాట్ యంత్రాల వినియోగం ద్వారా లోక్ సభ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. దీని కోసం దేశవ్యాప్తంగా 10.5లక్షల పోలింగ్ కేం ద్రాల్లో వీవీ ప్యాట్ యంత్రాలను ఉపయోగించాలని ఈసీ భావిస్తోం ది.

ఇప్పటి వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం ఒక వీవీప్యాట్ యంత్రాన్ని మాత్రమే ర్యాం డమ్‌ సెలక్షన్‌గా ఎన్నికల అధికారులు లెక్కిస్తున్నారు . దీనిపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తక్కువ ఓటర్ స్లిప్పులు కౌంట్ చేయడం వల్ల ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వస్తున్నాయని అప్పోజిషన్ లీడర్లు పేర్కొన్నారు. ఈవీఎంలను ట్యాం పరిం గ్‌ చేయడానికి కూడా వీలుందన్న ఆరోపణలు చేస్తున్నారు .పోలింగ్ జరిగితే ప్రతి నియోజకవర్గంలో కనీసం 50 శాతం వీవీప్యాట్ లలోని స్లిప్‌లను లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి . ఈ అంశానికి సంబంధించి మొత్తం 21 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటీషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్ యంత్రంలోని ఓటర్ స్లిప్పులను లెక్కించడానికి గల అభ్యంతరాలేంటో తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

అయితే ప్రతినియోజకవర్గం లో సగం (50%) వీవీ ప్యాట్ లలోని ఓటరు స్లిప్పులను లెక్కించడం మొదలెడితే ఎన్నికల ఫలితం వెలువడడం లేటవుతుందన్నది ఈసీ వాదన. మొత్తం ఓట్ల లెక్కింపునకు ఆరు రోజులుపడుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది.శాంపిల్ వెరిఫికేషన్ సరిపోతుందంటున్నారు .ఈవీఎం ల పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం వల్ల వస్తున్న అనేక సందేహాలకు వాటికి అనుసంధానంగా ఉండే వీవీప్యాట్ యంత్రాలు సమాధానమని నిపుణులు చెబుతున్నారు . ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడంవల్ల ఎలక్షన్‌ సమయంలో జరిగే దౌర్జన్యాలు, బ్యాలెట్‌ బాక్స్​లను ఎత్తుకుపోవడం,బ్యాలెట్‌ బాక్సుల్లో ఇంకు లేదా నీళ్లు వేయడం,దౌర్జన్యం గా బూత్ లలో ప్రవేశించి గంపగుత్తగా ఓట్లు వేసుకోవడంవంటి తగ్గిపోయాయన్నది కొట్టిపారేయలేని వాస్తవం. కాకపోతే, సాంకేతికంగా ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడానికి అవకాశాలున్నాయన్న అనుమానాలను పూర్తిగా తొలగిం చాల్సిన బాధ్యత ఎలక్షన్‌ కమిషన్‌పై ఉంది.

ఈవీఎంలతో ఎలక్షన్‌ ప్రాసెస్‌ సులభం

ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని చాలామంది సాం కేతిక నిపుణులు సమర్థిస్తు న్నారు. ఈవీఎంలు వచ్చి న తరువాత మనదేశంలో ఎన్నికల ప్రక్రియ సులభతరం అయిం దంటున్నారు. గంటలు గంటలు బ్యాలెట్ పత్రాలు లెక్కపెట్టుకు నే అవసరం పోయిం దన్నారు. కౌంటిం గ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఫలితాలు ప్రకటిం చే పరిస్థితులు వచ్చాయంటున్నారు. కేవలం రాజకీయ కారణాలను సాకుగా చూపించి ఈవీఎంలను వ్యతిరేకిం చడం సమంజసం కాదన్నది వీరి వాదన.

1998లోనే ఈవీఎంల వాడకం

1998లో మన దేశంలో ప్రయోగాత్మకంగా ఈవీఎంలను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రవేశపెట్టిం ది. 2001 తర్వా త అన్ని రాష్ట్రా ల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంలనే వినియోగిం చారు. మన ఎన్నికల వ్యవస్థలో ఈవీఎంల ఎంట్రీ ఒక పెనుమార్పుకు దారి తీసిం ది. ఈవీఎంల కంటే ముందు బ్యాలెట్ పేపర్లను ఎన్నికల నిర్వహణకు ఉపయోగిం చేవారు. దీం తో బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లడం, వాటిపై సిరా వేయడం, పోలిం గ్ కేం ద్రాల రిగ్గింగ్ వంటి సంఘటనలు జరిగేవి. అంతేకాదు బ్యాలెట్ పేపర్ల వాడకం వల్ల చెల్లని ఓట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవి. గుర్తుకు , గుర్తుకు మధ్య ఉండే గడి మీద ఓటు ముద్ర వేయడం, బ్యాలెట్ పేపర్ ను ఫోల్డ్ చేసినప్పుడు ఓటరు వేసిన గుర్తు, వేరే గుర్తుకు అతుక్కోవడం ఇలాంటి వాటి వల్ల చెల్లని ఓట్లు ఏడాదికేడాది పెరిగేవి. ఈవీఎంలు వినియోగిం చడం వల్ల ఒక నిమిషానికి కేవలం ఐదు ఓట్లే రిజిస్టర్ అయ్యేవి . ఈవీఎంలు రావడం వల్ల ఈ మాల్ ప్రాక్టీసె స్ కు తెరపడిం ది. ఈవీఎంలను ట్యాం పర్ చేసే అవకాశాలున్నాయన్న వాదనలు కూడా వచ్చాయి. ఈ వాదనలకు విరుగుడుగా ఈవీఎంల వాడకంలో మోడర్న్ టెక్నాలజీని ఎప్పటి కప్పుడు నిపుణులు అప్ డేట్ చేస్తున్నారు.

వీవీప్యాట్‌లకు మూలం

ఎన్నికల్లో ఈవీఎంల పద్ధతిని ప్రవేశపెట్టిన రెండేళ్లకు వాటి వాడకంపై అనుమానాలు తలెత్తాయి. ఈవీఎంకి ఉన్న బటన్ ని ఓటర్ నొక్కితే అది తాము అనుకున్న గుర్తుకు పడుతుం దా, లేదా అనే విషయంపై వెరిఫికేషన్‌ ఉండేది కాదు. ఓటర్‌ వేసిన ఓటును వెరిఫై చేయాల్సిన అవసరం ఉందని 2010 అక్టోబరులో కొన్ని రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి. దీం తో ఎన్నికల సంఘం తన ఆధ్వర్యం లో పనిచేసే టెక్నికల్ కమిటీకి అప్పగిం చింది. ఎలక్ట్రా నిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రా నిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) ఒక పరికరాన్ని డిజైన్ చేసి, ఈసీ టెక్నికల్ కమిటీ ముందు డిమాన్‌స్ట్రేట్ చేసిం ది. 2013లో ఈవీఎంలకు అనుసంధానంగా వీవీప్యాట్ యంత్రాలను వాడటం మొదలైంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలను మార్చారు. వీవీప్యాట్‌లు ఈ విధంగా మన ఎన్నికల ప్రక్రియలోకి ఎంట్రీ ఇచ్చాయి.

నాగాలాండ్ లో తొలివినియోగం

వీవీప్యాట్ యంత్రాన్ని మన దేశంలోమొదటిసారిగా 2013లో ఉపయోగిం -చారు. ప్రయోగాత్మకంగా ఆ ఏడాదినాగాలాండ్‌లోని నోక్సెన్ ఉప ఎన్నికలోవీవీప్యాట్ యంత్రాన్ని ఫస్ట్ టైమ్వినియోగిం చారు. తర్వాత అదే ఏడాదిజరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 10నియోజకవర్గాల్లో వాడారు. 2014జనరల్‌ ఎలక్షన్స్​లో దేశవ్యాప్తం గాఎనిమిది ఎంపీ నియోజకవర్గాల్లోప్రవేశపెట్టారు. ఈ ప్రయోగాలన్నీమంచి ఫలితాలనివ్వడంతో 2017లోజరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లోరాష్ట్రమంతా వీవీ ప్యాట్ లనుఉపయోగిం చారు.