మహాకుంభమేళలో బుధవారం (29 జనవరి) జరిగిన తొక్కిసలాట ప్రభావంతో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి VVIP పాసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా వాహనాలకు అనుమతి లేదని నిబంధనలు విధించింది.
బుధవారం మౌనీ అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అదే విధంగా మరో 60 మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ప్రయాగ్రాజ్లో కఠిన నిబంధనలు:
మహా కుంభమేళ ఏరియాలోకి వీవీఐపీలతో సహా ఏ వాహనానికి అనుమతి లేదు
వీవీఐపీ పాసులను రద్దు చేశారు
ప్రయాగరాజ్ చుట్టు పక్కల ఉన్న జిల్లాల నుంచి వాహనాల రాకపోకలు బంద్
ఫిబ్రవరి 4 వరకు ఫోర్ వీలర్ వాహనాలకు సిటీలోకి అనుమతి లేదు.