
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో నిరాశపర్చిన ఇండియా విమెన్స్ క్రికెట్‌కు... నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ దిశా నిర్దేశం చేయ బోతున్నాడు. మెగా ఈవెంట్‌తో చీఫ్ కోచ్ రమేశ్ పొవార్ కాంట్రాక్ట్ ముగిసిపోయింది. దీంతో కొత్త కోచ్ కోసం దరఖాస్తులు, ఇంటర్వ్యూలు, సెలెక్షన్ ప్రక్రియ మొత్తం వీవీఎస్ కనుసన్నల్లోనే నడవనుందని సమాచారం. వచ్చే ఏడాది అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్‌కప్ కూడా ఉండటంతో తర్వాతి బ్యాచ్ క్రికెటర్లను తయారు చేయడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఇందులో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించనున్నాడు.