న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న జింబాబ్వే టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వెళ్లే అవకాశాలున్నాయి. కొత్త హెడ్ కోచ్‌ను ప్రకటించేందుకు మరికొంత టైమ్ పట్టే చాన్స్ ఉండటంతో ఈలోగా ఎన్సీఏ స్టాఫ్‌తో కలిసి వీవీఎస్ ఇండియా టీమ్‌ను పర్యవేక్షించనున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శ్రీలంక టూర్‌కు కొత్త హెడ్ కోచ్ వచ్చే చాన్స్ ఉంది.
గతంలో కూడా రాహుల్ ద్రవిడ్ లేనప్పుడు లక్ష్మణ్ ఇండియా టీమ్‌కు కోచ్‌గా పని చేశాడు. ఇక జింబాబ్వే టూర్‌కు కొత్త ముఖాలతో కూడిన టీమిండియాను ఈ వారం చివర్లో ప్రకటించనున్నారు. జులై 6 నుంచి మొదలయ్యే ఈ టూర్లో ఇండియా.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.