బెంగళూరు: హైదరాబాద్ స్టయిలిష్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్.. మరో ఏడాది పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా కొనసాగే చాన్స్ ఉంది. యువ క్రికెటర్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వీవీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని బీసీసీఐ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సెప్టెంబర్‌తో లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ ముగియనుంది.
ఇక టీమిండియాకు చీఫ్ కోచ్ లేకపోయిన సందర్భాల్లోనూ జట్టును ముందుకు తీసుకెళ్తున్న లక్ష్మణ్ రెండు పాత్రలకు సరైన న్యాయం చేశాడు. లక్ష్మణ్ ఎన్‌సీఏ నుంచి బయటకు వెళ్తే ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు కూడా రెడీగా ఉన్నాయి. వీవీఎస్‌ను మెంటార్‌గా తీసుకుంటామని ఇప్పటికే లక్నో సూపర్‌జెయింట్స్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఎన్‌సీఏలోనే అతన్ని మరో ఏడాది కొనసాగిస్తే బాగుంటుందని బోర్డు భావిస్తోంది.