SitaRamam: సీత..రాముడికి ఉత్తరాలు రాసి..అప్పుడే రెండేళ్లు పూర్తయింది

క్లాసిక్ మూవీస్ డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi)  డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)  హీరోగా, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం సీతారామం(Sita Ramam). లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజై రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. 

"సీతారామంతో 2 సంవత్సరాల కలకాలం ప్రేమ,ఆ మాయాజాలం మన జీవితాల్లో,  ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయింది. ఈ ప్రయాణాన్ని చాలా ప్రత్యేకంగా చేసినందుకు మా అద్భుతమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అంటూ కృతజ్ఞతలు తెలిపింది.

సీత..రాముడికి ఉత్తరాలు రాసి..అప్పుడే రెండేళ్లు పూర్తయిందా?..అంటూ సీతారామం ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీని  థియేటర్లో చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరిని కదిలించింది. మంచి ఫీల్ గుడ్ కంటెంట్ తో ఉన్న స్టోరీ అందరి గుండెలను హత్తుకుంది. 

కురుక్షేత్రంలో రావణ సంహారం..యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అంటూ పలికిన డైలాగ్స్..ఎంతో అర్ధాన్ని తెలియాజేశాయి.ఈ మూవీలో లెటర్స్ తో..సీత, రాముడి డైలాగ్స్ మెస్మరైజ్ చేస్తూ..ఒక్కసారిగా క్లైమాక్స్ తో అందరికి కళ్ళలో కంటనీరు వచ్చేలా మృణాల్,దుల్కర్ నటించారు.దీంతో మృణాల్ కు,దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందారు.ఇక ఈ మూవీలో లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ నటించగా..సీతగా, నూర్జహాన్ గా మృణాళ్ సహజన నటనను కనబరిచింది. 

దర్శకుడు హను రాఘవపూడి కథ, స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, ఎమోషన్స్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశాయి. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి ప్రాణం పోసింది.ఇందులో రష్మిక మందాన,సుమంత్ కీలక రోల్స్ చేశారు.స్వప్నా సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై సి. అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు.