సీనియర్ నటి వైజయంతి మాల ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇటీవల ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న వైజయంతి ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి కృతజ్ఞత తెలియజేశారు. ఆ తర్వాత ప్రధాని మోడీ కొంత సమయం పాటు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను నరేంద్ర మోడీ అంతనా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
Glad to have met Vyjayanthimala Ji in Chennai. She has just been conferred the Padma Vibhushan and is admired across India for her exemplary contribution to the world of Indian cinema. pic.twitter.com/CFVwp1Ol0t
— Narendra Modi (@narendramodi) March 4, 2024
పద్మవిభూషణ్ వైజయంతి మాలను కలుసుకోవటం తనకు ఎంతో సంతోషంగా ఉందని, భారత సినీరంగానికి ఆమె అందించిన సేవలు ప్రశంసనీయం అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. ఈ ట్వీట్ పై వైజయంతి మాల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నటి మాత్రమే కాదని, గొప్ప భరత నాట్య కళాకారిణి అని కామెంట్ చేస్తున్నారు. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో వైజయంతి మాలను హేమమాలిని తదితరులు ఇటీవల కలిసి అభినందించారు.