గగన యానానికి లేడీ ‘వ్యోమ మిత్ర’

గగన యానానికి లేడీ ‘వ్యోమ మిత్ర’

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది చేపట్టనున్న ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్‌’ కోసం ఓ హాఫ్ హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. మన దేశం నుంచి తొలిసారిగా ఈ రోబోను నింగిలోకి పంపనుంది. గగన్‌యాన్‌లో భాగంగా ప్రయోగాత్మక పద్ధతిన ఓ రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు ఇస్రో సైంటిస్టులు. ఈ ప్రయోగం విజయవంతమైతే 2022 లో నింగిలోకి మానవులను పంపాలన్నది వారి ఆలోచన.

ఈ హాఫ్ హ్యుమనాయిడ్ కు వ్యోమమిత్రగా పేరు పెట్టిన శాస్త్రవేత్తలు..  బుధవారం బెంగుళూరులో జరిగిన మీడియా సమావేశంలో జర్నలిస్టులకు పరిచయం చేశారు. ఈ రోబో మిమిక్రీ చేయగలదు. మనుషులతో సంభాషించగలదు.  వ్యోమ్‌మిత్ర హిందీతోపాటు ఇంగ్లిష్ లోనూ మాట్లాడుతుంది. చేతులు, కాళ్లు కదపడం, కనురెప్పలు ఆడించడం వంటి పనులన్నీ చేస్తుంది.

వ్యోమమిత్రనున అంతరిక్షంలోకి పంపి  దాని పనితీరును ఎప్పటికప్పుడు రిపోర్ట్‌ అందుకుంటామని ఇస్రో శాస్త్రవేత్త శ్యామ్‌ దయాల్‌ అన్నారు. ఇది కేవలం ప్రయోగాత్మక పద్ధతిలో చేయనున్నట్టు ఆయన తెలిపారు.