గోదావరిఖని, వెలుగు: ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే జైలు తప్పదని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు విశేష అధికారాలు ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎస్సీ, ఎస్టీల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్, దళిత సంఘాల ఆధ్వర్యంలో రాంచందర్‌ను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో దళిత సంఘాల బాధ్యులు బొంకూరి మధు, మామిడిపల్లి బాపయ్య, రాయమల్లు, లంక సదయ్య, కొంకటి లక్ష్మణ్, కాంపల్లి సతీశ్, లింగయ్య, పాల రాజేశం, పులిమోహన్, అంతోటి నాగేశ్వరరావు, అడక పురం చంద్రమౌళి, వడ్డేపల్లి శంకర్, రావుల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. కాగా సింగరేణి భూనిర్వాసిత ప్రభావిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి భూనిర్వాసిత ప్రభావిత గ్రామాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనగామ శంకర్, రాసమల్ల రవికుమార్.. రాంచందర్‌కు వినతిపత్రం అందజేశారు.