సర్కార్ పన్నుపై Xప్లాట్ఫాంలో వేతనజీవి ఆవేదన..
నా మొత్తం ఆదాయం: రూ.30లక్షలు
చెల్లించిన ఆదాయపు పన్ను: రూ. 6లక్షల 24వేలు
మిగిలి ఉన్న నికర ఆదాయం: రూ. 23లక్షల76వేలు
ఇప్పుడు నేను రూ. 23.76L విలువైన కారుని కొనుగోలు చేస్తే:
GST + సెస్సు: రూ.11లక్షల40వేల480
చెల్లించిన మొత్తం పన్ను: రూ.6లక్షల24వేలు+ రూ.11లక్షల40వేల480 = రూ.17లక్షల64వేల480
ప్రభుత్వానికి చెల్లిస్తున్నంది రూ. 17లక్షల64వేల480లు
నాకు మిగిలింది రూ. 12 లక్షల 35 వేల 520
అంటే నేను సంపాదించిన దానిలో దాదాపు 60 శాతం ట్యాక్స్ కడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు అందరి చూపు బడ్జెట్ 2025 పైనేఉంది..ఈ సారి బడ్జెట్ లో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి..ఏ వస్తువల ధరలు పెరుగుతాయి..పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉండబోతున్నాయి.. మధ్య తరగతి, వేతన జీవులకు కేంద్రం ఈ బడ్జెట్ లో ఏమైనా మినహాయింపు ఇస్తుందా అని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత ట్యాక్సులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతి, వేతన జీవుల వినియోగాన్ని పెంచడానికి, ద్రవ్యోల్బణం తగ్గించేందుకు కొనుగోలు శక్తికి ఆదాయాన్ని పెంచడానికి పన్నులను తగ్గించాలని వేతన జీవులనుంచి డిమాండ్లు వస్తున్నాయి. రూ.20 లక్షల వరకు ఆదాయానికి ట్యాక్స్ రేట్లను తగ్గించడం, గ్రామీణ పునరుద్ధరణకు ప్రభుత్వ పథకాల పెంచడం వంటివి చేయాలని సూచనలు చేస్తున్నారు.
Also Read : బడ్జెట్లో పెట్రోల్, డీజిటల్ ధరలు తగ్గనున్నాయా
ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి తాను చెల్లించిన ట్యాక్సుల గురించి ఆవేదన చెందుతూ Xలో ఓ పోస్టు చేశారు..పర్సనల్ ట్యాక్సులపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాము సంపాదించిన దాంట్లో 60 శాతం ప్రభుత్వానికే ట్యాక్స్ రూపంలో కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగిగా తాను సంవత్సరానికి 30లక్షలు సంపాదిస్తే.. అందులో దాదాపు 18 లక్షలు ట్యాక్సు కడుతున్నామని ఉద్యోగులు ఆందోళన చెందుతూ తాను చెల్లించిన ట్యాక్స్ లిస్ట్ ను పోస్ట్ చేశారు.
My Total Income: ₹30,00,000
— Mr. Neeraj (@NeerajS00964849) January 30, 2025
Income Tax Paid: ₹6,24,000
Net Income Left: ₹23,76,000
Now, if I buy a car worth ₹23.76L:
GST + Cess: ₹11,40,480
Total Tax Paid: ₹6,24,000 + ₹11,40,480 = ₹17,64,480
Govt: ₹17,64,480 💀
Me: ₹12,35,520 🤡#Budget2025 #IncomeTax