కాంట్రాక్ట్​కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలె 

మణుగూరు, వెలుగు: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బీటీపీఎస్ గేట్ ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు బీజేపీ లీడర్లు సంఘీభావం తెలిపారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ భిక్షపతి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల డ్యూటీ టైమింగ్స్ ను అమలు చేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో లింగంపల్లి రమేశ్, బీర రమేశ్, తార ప్రసాద్, మున్నా తదితరులు పాల్గొన్నారు.