మాస్క్ వేసుకోనందుకు ఆర్డర్ తీసుకోని వెయిటర్.. టిప్ గా రూ. 33 లక్షలు

కరోనా భయంతో ప్రపంచమంతా మాస్క్ వేసుకుంది. ఏ దేశంలో అయినా సరే మాస్క్ తప్పనిసరి అయింది. మాస్క్ లేకపోతే ఎంట్రీ లేదని చాలా షాపింగ్ మాల్స్ బోర్డు కూడా పెట్టాయి. పెట్రోల బంకుల్లో సైతం మాస్క్ లేకపోతే పెట్రోల్ కూడా పోయడంలేదు. దాంతో మాస్క్ ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరంగా మారింది.

మాస్క్ పెట్టుకోలేదని రెస్టారెంట్లో కస్టమర్ కి సర్వ్ చేయని విచిత్ర ఘటన అమెరికాలో జరిగింది. శాన్ డియాగోకి చెందిన అంబర్ లిన్ గిల్లెస్ అనే మహిళ స్టార్ బక్స్ హోటల్ కి వెళ్లింది. ఆమె తనకు కావలసింది ఆర్డర్ చేయబోయింది. అయితే అక్కడే వెయిటర్ గా పనిచేస్తున్న లెనిన్ గుటిరెజ్ ఆమెకు సర్వ్ చేయడానికి నిరాకరించాడు. అప్పుడు గిల్లెస్ ఎందుకు సర్వ్ చేయవని లెనిన్ ని అడిగింది. దానికి సమాధానంగా లేనిన్.. ‘శాన్ డీగో కౌంటీ మే 1 న మాస్క్ ను తప్పనిసరి చేస్తూ నోటీసు జారీ చేసింది. షాపింగ్ చేసేటప్పుడు లేదా రెస్టారెంట్‌లో ఆహారాన్ని తీసుకునేటప్పుడు మరియు పబ్లిక్ ప్రాంతాలలో మాస్క్ ధరించాలని చెప్పింది. మా హోటల్ రూల్ కూడా అదే. వినియెగదారులు మాస్క్ పెట్టుకోకపోతే సర్వ్ చేయోద్దని మాకు ఆదేశాలున్నాయి’ అని చెప్పాడు.

హోటల్ కి వెళ్తే లెనిన్ తనకు సర్వ్ చేయకపోవడంతో అతన్ని నిందించాలని ఈ విషయం గురించి గిల్లెస్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ‘స్టార్‌బక్స్ వెయిటర్ నేను మాస్క్ పెట్టుకోలేదని సర్వ్ చేయలేదు. ఈ సారి వెళ్లినప్పుడు మినహాయింపు పత్రం తీసుకెళ్తాను’అని పోస్ట్ పెట్టింది. ఆ పోస్టుకు దాదాపు లక్షకు పైగా కామెంట్లు మరియు 50 వేలకు పైగా షేర్లు వచ్చాయి. చాలామంది నెటిజన్లు ‘లెనిన్ తన పని తాను చేశాడు. ఇందులో లెనిన్ నిందించాల్సిన అవసరం లేదు. యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలను అతను పాటించాడు’అని రిప్లె ఇస్తున్నారు. గిల్లెస్ ఏదో చేయబోతే.. లెనిన్ కు మంచే జరిగింది.

ఈ పోస్టు చూసిన మాట్ కోవిన్ అనే నెటిజన్ మాత్రం లెనిన్ కు పని పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ చూసి ఏదైనా చేయాలని అనుకున్నాడు. ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ ఫండ్ వసూల్ చేసి.. ఆ మొత్తాన్ని లెనిన్ కు టిప్ గా ఇవ్వాలని అనుకున్నాడు. వెంటనే ‘లెనిన్ స్టాండింగ్ అప్ టు ఏ శాన్ డియాగో కరెన్’అనే పేజీని పెట్టి ఫండింగ్ స్టార్ట్ చేశాడు. జూన్ 22న స్టార్ట్ చేసిన ఈ ఫండింగ్ ద్వారా శుక్రవారం సాయంత్రం వరకు 43 వేల డాలర్లు(దాదాపు రూ. 33 లక్షలు)వసూల్ అయ్యాయి. ఆ మొత్తాన్ని కోవిన్.. లెనిన్ కు అందజేయనున్నాడు.

ఈ సంఘటనపై స్పందించిన లెనిన్.. ‘నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక మహిళ హోటల్ కి వచ్చింది. ఆమె మాస్క్ పెట్టుకోలేదు. మాస్క్ పెట్టుకోకపోతే సర్వ్ చేయోద్దని అటు ప్రభుత్వం నుంచి మరియు మా యాజమాన్యం నుంచి ఆదేశాలున్నాయి అని చెప్పాను. దాంతో గిల్లెస్ బయటకు వెళ్లింది. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చి నా పేరు అడిగి, ఫొటో తీసుకొని పోయింది. ఈ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతుందని అనుకోలేదు. నా డ్యూటీ నేను చేశాను. ఆమె వల్ల ఈ రోజు నాకు చాలా పేరొచ్చింది. ఆమెకు ధన్యవాదాలు. అలాగే ఆమె పెట్టిన పోస్టు ద్వారా ఫండ్ రైజ్ చేసిన కోవిన్ కు ధన్యవాదాలు. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఆ డబ్బుతో ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టి.. పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తాను’ అని తన అనుభవాన్ని పంచుకున్నాడు.

I’ve received numerous messages asking for my side of the story. Since this seems to be the most popular thread I decided to post my personal experience here. Thank you all for the love and support.

Posted by Lenin Gutierrez on Wednesday, June 24, 2020