గ్రీన్ కార్డ్ కోసం ఓ వ్యక్తి 195 ఏండ్ల వెయిటింగ్ లిస్ట్!

గ్రీన్ కార్డ్ కోసం ఓ వ్యక్తి 195 ఏండ్ల వెయిటింగ్ లిస్ట్!

ఓ ఇండియన్ పరిస్థితిని వివరించిన రిపబ్లికన్ సెనెటర్
అతడి ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయాలని సెనెట్ కు విజ్ఞప్తి

వాషింగ్టన్: గ్రీన్ కార్డ్ పొందేందుకు ఓ ఇండియన్ 195 ఏండ్ల వెయిట్ లిస్ట్ లో ఉన్నాడట. ఈ విషయాన్ని రిపబ్లికన్ పార్టీ సెనెటర్ సెనెట్ దృష్టికి తీసుకొచ్చారు. అతడి సమస్యను తీర్చేందుకు ఓ రిజల్యూషన్ పాస్ చేయాలని ఆయన సెనెట్ ను కోరారు. అమెరికాలో పర్మినెంట్ గా నివాసం ఉండాలనుకునే ఇమ్మిగ్రెంట్లకు గ్రీన్ కార్డు జారీ చేస్తారు. దీనినే అఫీషియల్ గా పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ గా పిలుస్తారు. బుధవారం సెనెటర్ మైక్ లీ గ్రీన్ కార్డుల అంశాన్ని సెనెట్లో లేవనెత్తారు. ప్రస్తుత గ్రీన్ కార్డ్ పాలసీ ఓ వ్యక్తికి ఎలాంటి భరోసానూ ఇవ్వలేకపోతోందని, ఇమ్మిగ్రెంట్ పేరెంట్స్ చనిపోవడంతో వారి పిల్లాడికి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని చెప్పారు. అతని తల్లిదండ్రులు జాబ్ చేయకపోవడం వల్ల వారి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ను తిరస్కరించారని, దాని ఎఫెక్ట్ పిల్లాడిపై పడిందని అన్నారు. ‘‘ఇండియాకు చెందిన ఓ వ్యక్తి ఈ రోజు గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ లోకి ఎంటర్ అయ్యాడు. అతను ఈబీ–3 గ్రీన్ కార్డ్ పొందేందుకు 195 ఏండ్లు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితిలో వారిని వదిలేస్తే అతని పిల్లలు కూడా అమెరికా సిటిజన్స్ కాలేరు”అని లీ చెప్పారు.

ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కోల్పోతున్నారు
సెనెటర్ డిక్ డర్బిన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై లీ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రెంట్ వర్కర్లు, వారి పిల్లలు గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ లో చిక్కుకుపోకుండా రక్షణ కల్పించాలన్నారు. టెంపరరీ వర్క్ వీసాలపై ఇక్కడ పనిచేస్తున్న వారికి గ్రీన్ కార్డులు చాలా కీలకమని, బ్యాక్ లాగ్స్ వల్ల చాలా ఫ్యామిలీలు ఇమ్మిగ్రెంట్ స్టేటస్ ను కోల్పోయే ప్రమాదంలో పడుతున్నాయన్నారు. వారు ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కొల్పోకుండానే జాబ్స్ మారేందుకు, వేరే చోటుకు వెళ్లే అవకాశం కల్పించాలన్నారు. ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్ యాక్ట్ కు 3 మార్పులు చేయాలని లీ–డర్బిన్ ప్రతిపాదించారు. గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ సమస్యలను పరిష్కరించేందుకు అత్యుత్తమ మార్గాలపై తాము చర్చ కొనసాగిస్తామని చెప్పారు. 2019లో 9,008 మంది ఇండియన్లు కేటగిరీ 1(ఈబీ-1) గ్రీన్ కార్డులు పొందారు. కేటగిరీ 2(ఈబీ-2) కింద 2,908 మంది, కేటగిరి 3(ఈబీ-3) కింద 5,083 మంది ఇండియన్లు గ్రీన్ కార్డులు పొందారు.

అమెరికాకు తొలి రేసిస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్: బిడెన్
అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ మొదటి రేసిస్ట్ ప్రెసిడెంట్ అని డెమొక్రటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బిడెన్ అన్నారు. బుధవారం సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ టౌన్ హాల్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ను ట్రంప్ చైనా వైరస్ అని పిలుస్తూ, జాతి వివక్షను చూపుతున్నారన్న ప్రశ్నకు బిడెన్ బదులిస్తూ.. ట్రంప్ రేసిజాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. ప్రజల రంగు,జాతి, ప్రాంతాన్ని బట్టి ఆయన వ్యవహరిస్తున్నారని, ఇంతకుముందు అమెరికన్ ప్రెసిడెంట్లు ఎవరూ ఇలా చేయలేదన్నారు. చాలామంది రేసిస్టులు ప్రెసిడెంట్ అయ్యేందుకు ప్రయత్నించినా.. ప్రెసిడెంట్ అయిన మొదటి రేసిస్ట్ ట్రంప్ అని అన్నారు.

For More News..

హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మేలు

చైనా మార్స్  ప్రోబ్ ప్రయోగం సక్సెస్

ఇక నుంచి ఆర్మీలో మహిళలకు కీలక బాధ్యతలు