Health Tips: మార్నింగ్ వాక్ కంటే..ఇది చాలా బెటర్:రోజూ తిన్న తర్వాత10 నిమిషాల వాకింగ్..రెట్టింపు ప్రయోజనాలు

Health Tips: మార్నింగ్ వాక్ కంటే..ఇది చాలా బెటర్:రోజూ తిన్న తర్వాత10 నిమిషాల వాకింగ్..రెట్టింపు ప్రయోజనాలు

ఆరోగ్యంపై అవగాహన ప్రతి ఒక్కరూ వాకింగ్ చేస్తుంటారు. గంటల తరబడి మార్నింగ్ సమయాల్లో,ఈవినింగ్ టైం వాకింగ్ చేస్తుంటారు. ఇలా గంటల తరబడి వాకింగ్ మంచిదేనా..దీనికంటే ఏదైనా బెటర్ ఆప్షన్ ఉందా? అంటే ఉందనే అంటున్నారు డాక్టర్లు. కొన్ని ప్రత్యేక సమయాల్లో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం..యాక్టివ్ గా ఉంటారని అంటున్నారు. మార్నింగ్ వాక్ కంటే రోజూ ఈ ప్రత్యేక సమయాల్లో 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బెస్ట్ అంటున్నారు. ఆ గోల్డెన్ వాకింగ్ సమయం ఏంటో దానివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మనం రోజూ మార్నింగ్ వాక్ చేస్తుంటాం. అడుగులు లెక్కలు వేసుకుంటూ కొందరు వాక్ చేస్తే.. ఇంకొందరు ఎన్ని కిలోమీటర్లు నడిచాం అని కౌంట్ చేస్తుంటారు. చెమటోస్తుంటారు. అలసిపోతుంటారు. ఇంకా కొందరు వాకింగ్ లో కాళ్లనొప్పులు వంటి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. అయితే మార్నింగ్ వాక్ కంటే మరో ఉత్తమ మార్గం ఏదైనా ఉందా.. ? అంటే అవుననే అంటున్నారు న్యూట్రిషనిస్టులు. 

రోజూ మార్నింగ్ వాక్ కంటే మనం ఎప్పుడు భోజనం చేస్తే అప్పుడు పది నిమిషాలు నడిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. డాక్టర్ రిద్దీ పటేల్ అనే న్యూట్రిషనిస్టు ఇన్ స్టాగ్రామ్ లో వాకింగ్పై ఓ పోస్ట్ చేశారు. మార్నింగ్ వాక్ కంటే తిన్న తర్వాత (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) పది నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు. రోజులో 30 నిమిషాల వాకింగ్ గురించి చెబుతూ.. భోజనం తర్వాత 10నిమిషాలు వాకింగ్ చేస్తే.. డైలీ మార్నింగ్ వాక్ కంటే రెండు రెట్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్నారు. 

ఈ పదినిమిషాల వాకింగ్ ఒక్క డైజేషన్ పెంచడమే కాదు.. భోజనం తర్వాత చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందంటున్నారు. కాబట్టి మీరు డయాబెట్ అయితే ఇది మీరు తప్పకుండా చేయాల్సిన నియమం అంటున్నారు. రోజులో మూడు సార్లు భోజనం తర్వాత పది నిమిషాలు నడవాలి..ఒకే సారి పదివేల అడుగుల నడక కంటే ఇది చాలా ఉత్తమమైనది అని చెబుతున్నారు. మీరు అనుకున్న రోజువారీ అడుగుల లక్ష్యాన్ని సాధించినట్టుంది.. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. భోజనం తర్వాత నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయంటున్నారు. 

 ఈ 10 నిమిషాల నడకతో మరో మంచి ఆరోగ్య ప్రయోజనం.. బరువుతగ్గడం..  మీరు బరువు తగ్గాలని అనుకుంటే ఇది ఉత్తమమైన విధానం. భోజనం తర్వాత వాకింగ్ తో చాలా ప్రయోజనాలున్నాయి.  బాడీ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది..బాడీలో ఉన్న కొవ్వును కరగదీస్తుంది. క్రమం తప్పకుండా భోజనం తర్వాత వాకింగ్ .. అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.. బరువును కంట్రోల్ లో ఉంచుతుంది. సో..ఇంకెందుకు ఆలస్యం..మొదలు పెట్టండి.