
కామారెడ్డి, వెలుగు: గుండె పోటుతో టెన్త్ క్లాస్ స్టూడెంట్చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన నరేందర్ కూతురు అల్లె శ్రీనిధి (15) , జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతోంది. స్థానికంగా కల్కినగర్లో పెద్ద నాన్న శ్రీనివాస్ ఇంట్లో ఉంటూ స్కూల్కు వెళ్తోంది. గురువారం ఉదయం శ్రీనిధి స్కూల్కు వెళ్తుండగా మార్గమధ్యలో అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయింది. వెంటనే స్కూల్ టీచర్లు ఆమెను ప్రైవేట్హాస్పిటల్కు తరలించగా వెంటనే సీపీఆర్ చేసినా ఫలితం లేదు. కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. శ్రీనిధి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం. గుండె పనితీరును అకస్మాత్తుగా కోల్పోవడం. గుండె ఎలక్ట్రికల్ సర్క్యూట్ర్ సరిగ్గా పని చేయనప్పుడు ఇది జరుగుతుంది. ఈ సమయంలో ఈ అసహజ లయల సమయంలో గుండె త్వరగా, అస్థిరంగా కొట్టుకుంటుంది. తద్వారా శరీరమంతా రక్తాన్ని తగినంతగా పంప్ చేయడం గుండెకు కష్టమవుతుంది.
లక్షణాలు
- స్పృహ కోల్పోవడం
- శ్వాస ఆగిపోవడం
- పల్స్ లేకపోవడం
ఆరోగ్యకరమైన గుండె లయ, ప్రసరణకు సజావుగా సాగడానికి తక్షణ వైద్య సంరక్షణ అవసరం. ఈ సమయంలో సీపీఆర్ (CPR) చేయడం, డీఫిబ్రిలేటర్ ఉపయోగించడం వంటివి చేయడం చాలా ముఖ్యం. గాయపడిన గుండె కండరాలు క్రమరహిత హృదయ స్పందనలకు కారణమవుతాయి కాబట్టి గుండె ఆగిపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం. కార్డియాక్ అరెస్ట్ లో మాత్రం అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండా కూడా ఇది జరుగుతుంది.