Health Tip : చెప్పులు, షూ లేకుండా నడిస్తే ఇన్ని లాభాలా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..!

కాళ్లకు చెప్పుల్లేకుండా బయట తిరగడం సాధ్యమయ్యే పనేనా?. చాన్సే లేదు. పొద్దున బయటకు వెళ్లింది మొదలు.. రాత్రి ఇంటికి చేరేదాకా కాళ్లను ఖాళీగా ఉంచే ప్రసక్తే లేదు. పైగా బెడ్రూంలో కూడా చెప్పులేసుకుని తిరుగుతున్నప్పుడు ఆ పని ఇంకా కష్టం అనిపించవచ్చు. అయితే  ఇది శరీరానికి ఎంత మాత్రం మంచిది కాదు. అలాగని ఈ డెయిలీ రెటీన్ ను మార్చుకోవడం కష్టమే. అందుకే వారంలో కనీసం ఒక్కరోజైనా చెప్పుల్లేకుండా నడిస్తే మంచిదని రీసెర్చర్లు చెప్తున్నారు..

ALSO READ | Health Tips : మీ మజిల్స్ బలంగా ఉండాలంటే.. ఇవి తినండి.. వీటిని తినొద్దు.. !

వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్. షూస్.. ఇలా టైం, సీజన్ ని బట్టి వాడుతుంటారు. 'కాళ్లను కాపాడుకుంటున్నాం' అనుకుంటున్నారు. కానీ, కాళ్లను బిగించి కప్పేయడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎక్కువసేపు చెప్పులు వేసుకోవడం వల్ల పాదాల్లోని నరాల వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. ఒత్తిడి కారణంగా ఆ నరాలు. చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయని చెప్తున్నారు రీసెర్చర్లు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి, వారంలో కనీసం ఒక కిలోమీటర్ అయినా చెప్పుల్లేకుండా నడవడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

చెప్పులు లేకుండా నడిస్తే లాభాలివే...

  • నేలపై చెప్పుల్లేకుండా నడవడం వల్ల బాడీ వెయిట్ కి ఏదీ అడ్డురాదు. బాడీ షేప్ కాపాడుకోవచ్చు..
  • మోకాళ్లు, నడుం, వెన్నెముక, కోర్ వ్యవస్థలకు మంచిది.
  • పొత్తి కడుపుపై ఒత్తిడి పడుతుంది. తద్వారా జీర్ణక్రియ వ్యవస్థ సరిగా పని చేస్తుంది.
  •  ఇసుక, చిన్నచిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ సజావుగా సాగుతుంది.
  • బీపీ కంట్రోల్లో ఉంటుంది.
  • సహనం (పేషెన్స్) పెరుగుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. 

చెప్పుల్లేకుండా ఇంట్లో ఎంత సేపు నడిచినా ఫర్వాలేదు. కానీ, బయట తిరిగేటప్పుడు. మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎక్స్పర్ట్ సూచిస్తున్నారు. 'పార్క్​ లో , ఆఫీసుల్లో వీలుకుదిరినప్పుడల్లా నడవచ్చు. అయితే ఓపెన్ ప్లేస్లో తిరిగేప్పుడు గాజు పెంకులు, ఇనుప ముక్కలు ఉంటాయి. హానికలిగించే బ్యాక్టీరియా పాదాలకు అంటుకుంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మరీ ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ అప్రమత్తంగా ఉండాల'ని సూచిస్తున్నారు. నిపుణులు.