దారుణం: కూలిన గోడ.. బాలుడు మృతి..

సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. పక్కింటి గోడ కూలి బాలుడు మృతి చెందగా మరొక బాలుడికి తీవ్ర గాయలయ్యి పరిస్థితి విషమంగా మారింది. ఆత్మకూరు మండలం నెమ్మికల్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ప్రమాదంలో తమ్ముడు హిమాన్షు మృతి చెందగా ఆరేళ్ళ దేవాన్ష్ కు తీవ్ర గాయాలయ్యాయి. దేవాన్ష్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. 

ఆదివారం కావడంతో ఇంటివద్దే పిల్లలు ఆడుకుంటున్న సమయంలో పక్కింటి గోడ కూలి ఈ దారుణం జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను ఈ దుస్థితిలో చూడలేక తల్లి కన్నీరు మున్నీరవుతోంది.ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.