హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం (ఆగస్టు 27, 2024) హఫీస్ పేట్ లోని ప్రేమ్ నగర్ బీ బ్లాక్ లో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి పక్కన ఉన్న ఇంటిపై పడింది.ఇటుక రాళ్లు పడటంతో ఇద్దరు బాలికలకు తలకు తీవ్రగాయాలయ్యారు. చికిత్సకోసం చిన్నారులను ఆస్పత్రికి తరలించారు..
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా భవన నిర్మాణం చేపట్టిన యాజమాన్యం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆరు అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన GHMC అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే స్పందించి భవన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.