గోడమీద బొమ్మ

గోడమీద బొమ్మ

ఆర్ట్​.. జనాన్ని ఆలోచింపజేస్తుందనటంలో డౌటే లేదు. గ్యాలరీల్లోని ఆర్ట్ వర్క్​​​తో పోల్చితే ఓపెన్​ ఆర్టే మోస్ట్​ పవర్​ఫుల్ అని క్రియేటివ్​ పీపుల్​ అంటున్నారు. నాలుగ్గోడల మధ్య చూపించే పెయింటింగ్స్​ కన్నా పబ్లిక్​ ప్లేసుల్లో గోడలపై గీసిన, నేరుగా కనిపిస్తున్న బొమ్మలనైతే ఎక్కువ మంది చూస్తారని చెబుతున్నారు. ప్రజల్లోకి సోషల్​ మెసేజ్​ని సింపుల్​గా​ పంపటానికి ఇదే బెస్ట్​ ఆప్షన్​ అని వివరిస్తున్నారు. ఢిల్లీలోని వందల కాలనీల్లో ఒకటైన లోధీ కాలనీని వండర్​ఫుల్​ ‘లోధీ ఆర్ట్​ డిస్ట్రిక్ట్​’లా మార్చిన ఓ సంస్థ.. పాట్నాలోనూ అదే ప్రయత్నం చేస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో వందల కాలనీలు ఉన్నాయి. వాటిలో సౌత్​ ఢిల్లీలోని లోధీ కాలనీ సమ్​థింగ్​ స్పెషల్​. ‘ఇండియాలోనే తొలి ఓపెన్​ ఎయిర్​ ఆర్ట్​ డిస్ట్రిక్ట్​’లా పేరొందింది. వివిధ దేశాలకు చెందిన 14 మంది ఆర్టిస్టులు ఈ కాలనీలో 12 చోట్ల పెద్ద బిల్డింగ్​ల గోడలను అందమైన కాన్వాస్​లా మలచుకొని అద్భుతమైన పెయింటింగ్​లు వేశారు. వాటిలో ప్రతిదీ ‘వావ్..’​ అనిపిస్తుంది. ఖన్నా మార్కెట్​, మెహెర్​చంద్​ మార్కెట్​ల మధ్య వచ్చే పోయే దారిలో ఈ బ్రిలియెంట్​ ఆర్ట్​ వర్క్​ ఉంది. అటుగా వెళ్లిన ప్రతిఒక్కరూ ఆ బొమ్మలను చూసి స్టన్​ అవటం ఖాయం.

ఆ ఆర్ట్​ వర్క్ గొప్పతనాన్ని డైరెక్ట్​గా చూస్తే తప్ప మాటలతో, ఫొటోలతో వర్ణించలేం. ఒక్కో పెయింటింగ్​కీ ఒక్కో డిఫరెంట్​ కాన్సెప్ట్​. ప్రతి బొమ్మకీ ప్రకృతే ఇన్​స్పిరేషన్​. ‘పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్రతిఒక్కరి బాధ్యత’ అని చెప్పటమే ఆ క్రియేటివ్​ వర్క్​ వెనక ఉన్న ఉద్దేశం. వీటికితోడు ఆ ప్రదేశంలోని అణువణువునూ క్లీన్​ అండ్​ గ్రీన్​గా మార్చారు.

ఢిల్లీ నుంచి పాట్నా వరకు..

ఢిల్లీలో నాలుగేళ్ల క్రితం రెండు గోడల మీద బొమ్మలేయటంతో మొదలైన స్ట్రీట్​ ఆర్ట్​ సంస్థ జర్నీ 2019లో 22 గోడలకు చేరింది. ఈ ప్రాజెక్టు పాపులారిటీ దేశ రాజధాని ఢిల్లీ నుంచి బీహార్​ రాజధాని పాట్నా వరకు చేరింది. ప్రజల ఆలోచనను పర్యావరణ పరిరక్షణ వైపుకు తిప్పటానికి ఇదే సరైన మార్గమని భావించిన పాట్నా ఆఫీసర్లు అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. స్ట్రీట్​+ఆర్ట్​ సంస్థను సంప్రదించి ఓపెన్​ ఎయిర్​ ఆర్ట్ ప్రాజెక్టును తమ సిటీలోనూ చేపట్టాలని కోరారు. దీంతో ఐదుగురు ఆర్టిస్టులు ఆ నగరంలో వాలిపోయి పని మొదలుపెట్టారు.

ఈ గ్రూపులో ఇండియా, అర్జెంటీనా ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లు మూడు వారాల పాటు కష్టపడి పాట్నాలోని ఫేమస్​ బెయిలీ రోడ్డులో ఉన్న విద్యుత్​ భవన్ నాలుగు గోడలపై బ్రహ్మాండమైన బొమ్మలు గీశారు. అవి ఆ దారిలో రాక పోకలు సాగించేవారిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పెయింటింగ్​లు ఒక్కొక్కటి దాదాపు 70 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఈ కలర్​ఫుల్​ జెయింట్​ ఆర్ట్​ వర్క్​ని స్థానికులు ముద్దుగా చూస్తూ ముచ్చటించుకుంటున్నారు. సల్వార్​ కమీజ్​ వేసుకొని, చేతిలో పక్షిని పట్టుకొని, ప్రశాంతంగా చూస్తున్న​ ఓ అమ్మాయి, బ్యాక్​డ్రాప్​లో చెట్టు, ఉదయిస్తున్న సూరీడు, అమ్మాయి పక్కన జింక, చుట్టూ పచ్చదనం.. ఈ ఆర్ట్ వర్క్​ చాలా సహజంగా, చక్కగా ఉంది.

కలిసి జీవించాలనేదే కాన్సెప్ట్​

ఈ పెయింటింగ్​కి వెనక పోర్షన్​లో.. ఒక అబ్బాయి, అతని చేతిలో ఒక మొక్క, చుట్టూ గ్రీనరీ, పూలు, జంతువులు.. అచ్చం అటవీ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న బొమ్మ కూడా ‘భలే..’ అనిపిస్తుంది. ఈ రెండు నేచురల్​ ఆర్ట్​ వర్క్​లూ మనుషులను ప్రకృతితో కలిసి జీవించమనే సందేశాన్ని ఇస్తున్నట్లు ఉన్నాయని వాటిని చూసినవారు అనుకుంటున్నారు. మొక్కలను, జంతువులను కూడా మనుషుల్లాగే భావించాలని చెప్పటమే ఈ పెయింటింగ్​ల కాన్సెప్ట్​ అని ఆర్టిస్టులు వివరిస్తున్నారు.

పాట్నా సిటీ కల్చర్​ని, అక్కడి ప్రజల లైఫ్​స్టైల్​ని చూడటానికి షార్ట్​ టూర్​లో భాగంగా వచ్చిన అర్జెంటీనా జంట.. నగరంలో తాము గమనించిన అంశాలనే ఈ వాల్​ ఆర్ట్​ రూపంలో వర్ణించామన్నారు. పెయింటింగ్స్​లో కనిపించే అమ్మాయి, అబ్బాయి క్యారెక్టర్లను రియల్​గా చూశామని, ఎన్విరాన్​మెంట్​ పట్ల వాళ్లకు ఉన్న కమిట్​మెంట్​కి ఇన్​స్పైరై ఈ బొమ్మలు గీశామని చెప్పారు. ఈ ఆర్ట్​ వర్క్​కి వాడుతున్న రంగులను ‘ఏషియన్​ పెయింట్స్​’వాళ్లు ఇస్తున్నారని ప్రాజెక్ట్​ మేనేజర్​ రితేశ్​ శర్మ తెలిపారు.

‘స్వచ్ఛ భారత్​’ లక్ష్యంగా

సిటీ పైన, అక్కడ నివసించేవారి పైన ఆర్ట్​ పాజిటివ్​ ప్రభావాన్ని చూపించగలదు. ప్రజలకు ఎన్విరాన్​మెంట్​పై మరింత అవగాహన కల్పించే కెపాసిటీ పెయింటింగ్​లకు ఉంది. దేశంలోనే మొట్టమొదటి పబ్లిక్​ ఆర్ట్​ డిస్ట్రిక్ట్​కి రూపకల్పన చేయటం ద్వారా జనాన్ని స్వచ్ఛ భారత్​ మిషన్​ వైపునకు సక్సెస్​ఫుల్​గా నడిపించాలని భావించాం. ఈ దిశగా గవర్నమెంట్​తో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటున్నాం. మా సంస్థ ఢిల్లీలో అమేజింగ్​ స్ట్రీట్​ ఆర్ట్​ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుంది.

– అర్జున్​ బహ్ల్,​

‘స్ట్రీట్​+ఆర్ట్​’ కో–ఫౌండర్,

ఆర్ట్​ ఫెస్టివల్​ డైరెక్టర్