ఏఐసీసీ హెడ్ ఆఫీసు ముందు వాల్ పోస్టర్ల కలకలం

ఏఐసీసీ హెడ్ ఆఫీసు ముందు వాల్ పోస్టర్ల కలకలం
  • రైతుబంధుపై కాంగ్రెస్ యూటర్న్ అంటూ స్టిక్కర్లు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఏఐసీసీ హెడ్ ఆఫీసు వద్ద వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆఫీసు గోడలు, గేటు ముందు ఉన్న బారికేడ్లపై మంగళవారం స్టిక్కర్లు దర్శనమిచ్చాయి. ఇందులో రైతు బంధు విషయంలో కాంగ్రెస్ యూటర్న్ తీసుకుందని రాసి ఉంది.

 అలాగే ‘రాహుల్ గాంధీ ఎకరానికి రూ.15వేలు ఇస్తామని వరంగల్ డిక్లరేషన్ లో హామీ ఇచ్చారు. 2024లో రైతులకు విడుదల చేసింది మాత్రం సున్న. ఇప్పుడు సీఎం రేవంత్ యూ టర్న్ తీసుకుని రూ.12 వేలు ఇస్తామంటున్నారు’ అని వాల్ పోస్టర్లలో ఇంగ్లీష్ లో విమర్శించారు.