
అమెరికాలోని ప్రముఖ బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ లేఆఫ్స్ ప్రకటించింది. తన కంపెనీ ఉద్యోగుల్లో 2వేల మందిని తొలగించింది. కంపెనీ డెవలప్ మెంట్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ లేఆఫ్స్ తో కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 2నుంచి 3 మందిపై ప్రభావం పడుతుందని చెబుతోంది.
2024 చివరి నాటికి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 80వేల మంది ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక.. తారిఫ్ ల బాగోతం ఆర్థిక వ్యవస్థలలో అస్థిరత, వాల్ స్ట్రీట్ మార్కెట్ అనూహ్య మార్పుల ఫలితంగా కంపెనీ శ్రామిక శక్తిని తగ్గించుకున్నట్లు చెబుతోంది.
ALSO READ | వాట్సాప్ షాక్ : ఇండియాలో 99 లక్షల అకౌంట్స్ డిలీట్
మోర్గాన్ స్టాన్లీ బ్యాంకు పోటీదారు అయిన గోల్డ్ మన్ సాచ్స్ కూడా ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. దాదాపు తన వర్క్ ఫోర్స్ లో 3నుంచి 5శాతం తగ్గించే అవకాశం ఉంది. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా ఇన్వెస్ట్ బ్యాంకింగ్ విభాగంలో 150 మంది జూనియర్ బ్యాంకర్ ఉద్యోగులను తొలగించింది.
బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు ప్రకారం..మోర్గాన్ స్టాన్లీ ఉద్యోగాల కోతలు ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఉంది. మరికొన్ని బ్యాంకుల్లో ఉద్యోగులను వేరే బ్రాంచిలకు బదిలీ చేసే అవకాశం ఉంది.