
లాక్ డౌన్ క్రమంలో పలు గ్రామాల్లోని సరిహద్దుల్లో కంచెలు వేసిన విషయం తెలిసిందే. తమ గ్రామాలకు వేరే ఊరి వ్యక్తులు రావద్దంటూ బారికేడ్లు పెడుతున్నారు. కానీ ఏపీ-తమిళనాడు సరిహద్దులోని పలు ప్రాంతాల్లో ఏకంగా గోడలు కట్టేశారు తమిళనాడుకు చెందినవారు. దీంతో ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. చిత్తూరు జిల్లా నుండి తమిళనాడును కలిపే మూడు ప్రాంతాల్లో రోడ్ల మీద గోడలను నిర్మించారు.
ఇదే విషయంపై ఏపీ ప్రజలు నిలదీయగా.. తమిళనాడు రాష్ట్రం వేలూరు కలెక్టర్ ఆదేశాల మేరకు గోడలు నిర్మించామని తెలిపారట తమిళనాడుకు చెందిన కార్మికులు. దీనిపై విమర్శలు గుప్పించిన చిత్తూరు జిల్లా స్థానికులు గోడ నిర్మాణం సంఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.