ఇండియాలో వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ షాపింగ్​

  • ఇక్కడే బొమ్మలు, బూట్లు, సైకిళ్ల కొనుగోలు
  • ఈ విషయామై సప్లయర్లతో చర్చలు

న్యూఢిల్లీ: భారతదేశం నుంచి 2027 నాటికి తన ఎగుమతుల విలువను ఏటా10 బిలియన్ డాలర్లకు పెంచాలని అమెరికా రిటైల్ కంపెనీ వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ టార్గెట్​గా పెట్టుకుంది. ఇందులో భాగంగా లోకల్​ సరఫరాదారుల నుంచి బొమ్మలు, బూట్లు సైకిళ్లను కొనాలని చూస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్స్, వినియోగ వస్తువులు, ఆరోగ్యం  సంరక్షణ, దుస్తులు  హోం టెక్స్​టైల్స్​వంటి విభాగాలలో కొత్త సరఫరాదారులను కూడా వెతుకుతున్నామని కంపెనీ ప్రతినిధి  తెలిపారు. ఇందుకోసం వాల్​మార్ట్​ ప్రధాన కార్యాలయ సంస్థ అధికారులు ఇటీవల ఇండియా బొమ్మల తయారీదారులతో వర్చువల్​గా మాట్లాడారు. తమ అవసరాలు, కావాల్సిన నాణ్యతా ప్రమాణాల గురించి బొమ్మల తయారీదారులకు తెలియజేశారు. ఐకియా వంటి గ్లోబల్ రిటైలర్లు తమ అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఇప్పటికే భారతదేశం నుంచి బొమ్మలను సోర్సింగ్ చేస్తున్నాయి.  ఇండియా బొమ్మల పరిశ్రమ పుంజుకుంటోందని, మనదేశం కొన్ని సంవత్సరాల క్రితం వరకు బొమ్మలను దిగుమతి చేసుకునేదని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆప్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​ (డీపీఐఐటీ) వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ ఆఫీసర్లను, టాయ్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒకచోట చేర్చింది.

దీనిపై కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, "భారతదేశం నుంచి సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉన్న సరఫరాదారులతో కలిసి పని చేస్తోంది. దుస్తులు, హోం టెక్స్​టైల్స్​తోపాటు ఆహారం, ఫార్మాస్యూటికల్స్, వినియోగ వస్తువులు, వెల్​నెస్‌‌‌‌‌‌‌‌​, ఆరోగ్యం వంటి విభాగాల ప్రొడక్టుల సరఫరాల కోసం కొత్త డిస్ట్రిబ్యూటర్ల కోసం చూస్తోంది. బొమ్మలు, బూట్లు, సైకిళ్ల కొనుగోలు కోసం ఉన్న అవకాశాలను మేం పరిశీలిస్తున్నాం” అని ఆయన చెప్పారు.  

చిన్న ఇండస్ట్రీలకు మేలు

వాల్​మార్ట్​ భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతులను పెంచడం ఇండియాలోని సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్​ఎంఈలు) భారీగా బిజినెస్​ దక్కుతుంది. ఆహారం, ఫార్మాస్యూటికల్స్, వినియోగ వస్తువులు, ఆరోగ్యం & వెల్నెస్ సాధారణ వస్తువులు, దుస్తులు, హోం అప్లియెన్సెస్ ​కోసం కొత్త డిస్ట్రిబ్యూటర్ల కోసం చూస్తున్నామని ఈ నెల ప్రారంభంలో ఇండియా వచ్చిన వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ ఇంక్ ప్రెసిడెంట్ సీఈఓ డగ్ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిల్లన్ వెల్లడించారు. భారతదేశ సప్లయర్ల ఎకోసిస్టమ్​ తమకు సహాయపడుతుందని చెప్పారు. భారతీయ సంస్థలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, భారతీయ వ్యాపారాలకు అవకాశాలను విస్తరించడానికి   రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేసినట్టు వెల్లడించారు. మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లన్ ప్రధాని నరేంద్ర మోడీతోనూ ఈ విషయాలపై చర్చించారు. లాజిస్టిక్స్, స్కిల్స్​, అభివృద్ధి, సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.

బొమ్మలు, సీఫుడ్, ఇతర వస్తువుల ఎగుమతుల్లో భారతదేశం మొదటిస్థానంలో ఉందని డగ్​ వివరించారు. దేశీయంగా బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు వరుసగా చర్యలు తీసుకుంటున్న డీపీఐఐటీ.. ఇందులో భాగంగా భారతీయ తయారీదారులు కంప్లయన్స్​ రూల్స్​ను పాటించేందుకు, భారతదేశం నుంచి ఎగుమతులను పెంచేందుకు, ప్రపంచ కంపెనీలతో జతకట్టడానికి సహాయం చేస్తోంది. ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్, టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మను గుప్తా మాట్లాడుతూ, రైడ్-ఆన్, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డోర్, మెకానికల్ టాయ్​ బొమ్మలను కొనేందుకు వాల్​మార్ట్​ తమను సంప్రదించినట్లు చెప్పారు. వీటిలో 400 మిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రిసిటీ బొమ్మలు ఉంటాయని వెల్లడించారు. 2022–23 ఏప్రిల్– డిసెంబర్ మధ్య దేశ బొమ్మల ఎగుమతులు విలువ రూ. 1,017 కోట్లు. 2021–22లో ఎగుమతులు రూ.2,601 కోట్లుగా ఉన్నాయి. 2013–14 ఏప్రిల్–డిసెంబర్ మధ్య  రూ.167 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. 2021–22లో భారతదేశానికి బొమ్మల మొత్తం దిగుమతి 70 శాతం తగ్గి రూ. 870 కోట్లకు చేరుకుంది.